సినిమా

Sharwanand: ఆ గంగ కాస్తా పెనుగంగగా మారితే "భోగి"

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Sharwanand: కొన్ని సినిమాలు కథా బలం మీద ఆడుతుంటాయి..బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ నమోదు చేస్తుంటాయి. అలాంటి, సినిమాల లిస్ట్‌లోకి చేరేలా ఉంది శర్వానంద్ నటిస్తున్న భోగి సినిమా. తాజాగా, ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజైంది. విజయవాడలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ సినిమా గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భోగితో హ్యాట్రిక్ పక్కా:

తాజాగా జరిగిన భోగి ప్రమోషనల్ ఈవెంట్‌లో శర్వానంద్ ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టబోతున్నానని ఎంతో ధీమాగా చెప్పాడు. ఈ ఏడాది ప్రారంభంలో నారి నారి నడుమ మురారి, బైకర్ సినిమాలతో వచ్చి వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలో సంపత్ నంది దర్శకత్వంలో భోగి సినిమాను చేశాడు. ఇందులో, శర్వా 'గంగ' అనే మాస్ అవతారంలో అయిదుగు చెల్లల్లకి అన్నగా నటిస్తున్నాడు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా, మూఢ నమ్మకాలు, ఆచారాలు, బలిదానం వంటి థ్రిల్లర్ అంశాలలో రూపొందుతోంది. అయిదుగురిలో నలుగురు చెల్లల్లను కోల్పోయిన గంగ.. ఆ తర్వాత, పెనుగంగగా ఎలా మారాడనేదే భోగి కథ అని సినిమా గురించి క్లుప్తంగా చెప్పాడు శర్వా. హీరోయిన్స్‌గా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటించారు.

ఇక, ఈ సందర్భంగా విజయవాడతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు శర్వా. కాగా, భోగి సినిమా ఈ నవంబర్ 12న భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. తాజాగా, చంద్రబోస్ రాసిన పాటను మేకర్స్ రిలీజ్ చేయగా..యూట్యూబ్‌లో ఈ పాట ట్రెండ్ అవుతోంది. మొత్తానికి, సంక్రాంతికి ముందు వచ్చే భోగిని శర్వా ముందుగానే తీసుకురాబోతున్నాడు.

#Sharwanand#Bhogi#Sampath Nandi#Anupama Parameswaran#Dimple Hayathi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి