Tollywood: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ప్రతీ 10 ఏళ్ళకి జానర్ మారుతుంటుంది. ఒకదశలో కేవలం ప్రేమకథా చిత్రాలే ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కువగా యంగ్ హీరోలు చేసిన ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము దులుపుతాయి. బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్‌తో తొడకొట్టాడు. ఆ విధంగా ఇప్పుడు మిస్టిక్ థ్రిల్లర్స్, మైథలాజికల్, సస్పెన్స్ థ్రిల్లర్స్ భారీ సక్సెస్ సాధిస్తున్నాయి. ఆ పల్స్ పట్టుకున్నాడు ఆది సాయి కుమార్..హిట్ కొడుతున్నాడు.
లవ్‌లీ సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయికుమార్.. మొదటి సినిమాతో భారీ హిట్ సాధించాడు. సాయి కుమార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది..డెబ్యూ సినిమాకి ఒకే అనిపించుకున్నప్పటికీ..ఆ తర్వాత మాత్రం మాస్ ఆడియన్స్‌కి దగ్గర కాలేకపోయాడు. చేయడానికి చాలా సినిమాలు చేశాడు. కానీ, అవేవీ స్టార్ స్టేటస్‌ను తేలేదు. అయినా, ఆది మాత్రం వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు.
జానర్ మార్చిన ఆది:
అయితే, కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ‘శంబాల’ అనే మిస్టిక్ థ్రిల్లర్ మూవీని చేశాడు. ముందు, ఈ సినిమాపై అంచనాలు లేకపోయినా, ఆ తర్వాత ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘శంబాల’ విడుదలయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. చాలా ఏళ్ళ తర్వాత ఆదికి అద్భుతమైన విజయం దక్కింది. ఫ్లాపులొస్తున్నా, అదే జానర్ కంటిన్యూ చేయకుండా వైఫల్యాలకి కారణం గ్రహించిన ఆది..‘శంబాల’తో సాలీడ్ హిట్ అందుకున్నాడు.
‘రుద్ర’ అవతారంలో ఆది:
ఈ దసరా పండుగ సందర్భంగా ఆది సాయి కుమార్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు మేకర్స్. ‘రుద్ర’ అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకి నవర్రసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ - రుద్రప్పలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండటం విశేషం. ‘రుద్ర’ కూడా ‘శంబాల’ తరహాలోనే మిస్టిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. దీన్ని బట్టి మిగతా యంగ్ హీరోలు కూడా ట్రెండ్‌కి తగ్గట్టు ఆడియన్స్ టేస్ట్ ప్రకారం..కమర్షియల్ అండ్ మాస్ జానర్ సినిమాలను కాకుండా, ఆది మాదిరిగా ట్రెండింగ్‌లో ఉన్న జానర్ సినిమాలు చేస్తే సక్సెస్ తథ్యం.


