International

India-US: భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. రూబియో సంచలన ప్రకటన!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

భారత్, యునైటెడ్ స్టేట్స్ (USA) మధ్య ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Deal) ఖరారుకు అతిసమీపంలో ఉన్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. రెండు దేశాల మధ్య కొన్ని చిన్నచిన్న సాంకేతిక అంశాలు మాత్రమే పరిష్కరించాల్సి ఉందని, మరో కొద్ది వారాల్లోనే ఈ చారిత్రాత్మక ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

 భారత్, యునైటెడ్ స్టేట్స్ (USA) మధ్య ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Deal) ఖరారుకు అతిసమీపంలో ఉన్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. రెండు దేశాల మధ్య కొన్ని చిన్నచిన్న సాంకేతిక అంశాలు మాత్రమే పరిష్కరించాల్సి ఉందని, మరో కొద్ది వారాల్లోనే ఈ చారిత్రాత్మక ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అధికారిక పర్యటనలో భాగంగా ముంబై చేరుకున్న మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో (S. Jaishankar) తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

 ఈ సందర్భంగా జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, రక్షణ రంగాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. ముడి చమురు శుద్ధి (Oil Refining) రంగంలో భారత్‌ను ప్రపంచ స్థాయి ‘సూపర్ పవర్’ (Superpower) గా మార్కో రూబియో కొనియాడారు. వెనిజులా, ఇతర అంతర్జాతీయ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురును భారత్‌లో మరింత ఎక్కువగా శుద్ధి చేసి, అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు రక్షణ వ్యవస్థల కొనుగోళ్లను పెంచుకోవాలని భారత్‌ను కోరారు.

 ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ అనంతరం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో సాధించిన అద్భుతమైన పురోగతిని ఇరుపక్షాలు స్వాగతించాయని, ఒప్పందాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఇరు దేశాలు పూర్తి కట్టుబడి ఉన్నాయని వెల్లడించింది. ఈ ద్వైపాక్షిక చర్చల అనంతరం యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో కలిసి జైశంకర్, మార్కో రూబియోలు త్రైపాక్షిక సమీక్షలోనూ పాల్గొన్నారు.

#IndiaUSTradeDeal#MarcoRubioIndiaVisit#SJaishankar#USIndiaRelations2026#TradeAgreementUSIndia#EnergyAndDefenseDeal#InternationalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి