టాప్ న్యూస్

TG : 22ఏ చల్తా.. చందనవల్లిలో సీఎం రేవంత్ సోదరుడి భూ దందా..!

రచన: Kumar••9 నిమిషాల పఠనం

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితా భూముల పంచాయితీ ఇంకా కొలిక్కి రాకముందే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి భూ దందాపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ సీఎం కుటుంబ సభ్యుల మీద భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత మన్నెక్రిశాంక్ ముఖ్యమంత్రి కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు.

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితా భూముల పంచాయితీ ఇంకా కొలిక్కి రాకముందే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి భూ దందాపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ సీఎం కుటుంబ సభ్యుల మీద భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత మన్నెక్రిశాంక్ ముఖ్యమంత్రి కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రైతులు, సామాన్యుల భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని, కమీషన్లు ఇచ్చిన వారి భూములను 22 ఏ నుంచి తీసేస్తున్నారని.. లేదంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

TG : 22ఏ చల్తా.. చందనవల్లిలో సీఎం రేవంత్ సోదరుడి భూ దందా..!

లావాని పట్టా భూములకు రెక్కలు..

లావాణీ పట్టా భూములు అనగా భూమిలేని పేదలకు లేదా అర్హులైన వ్యక్తులకు వ్యవసాయం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పట్టా రూపంలో కేటాయించిన భూములు అని అర్థం. ఈ భూములును సాధారణ భూమి వలే అమ్మడానికి వీలు లేదు. ఒకవేళ పట్టదారు ఇతరులకు భూమిని విక్రయించాలనుకుంటే ప్రభుత్వం పట్టాలు ఇచ్చే సమయంలో ల్యాండ్ కేటాయింపు నిబంధనలు, పట్టా జారీ తేదీ, వర్తించే చట్టాలను పరిశీలించాల్సి ఉంటుంది.ఎందుకంటే కొన్నిరకాల అసైన్డ్ భూముల ఓనర్ షిప్ బదిలీపై చట్టపరమైన నిషేధాలున్నాయి.

TG : 22ఏ చల్తా.. చందనవల్లిలో సీఎం రేవంత్ సోదరుడి భూ దందా..!

చందనవల్లిలో భూ దందా..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని చందనవల్లిలో లావాని పట్టా భూములకు రెక్కలు వచ్చాయి.ఇక్కడ కొన్ని భూములు 22 ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఓ వైపు లావాని పట్టా, మరోవైపు 22ఏ నిషేధిత జాబితాలోకి వెళ్లినందున భూముల క్రయవిక్రయాలు సాధ్యం కాదు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కృష్ణారెడ్డి లావాని పట్టా, 22ఏలో ఉన్న 4.2 ఎకరాల భూమిని ‘R9 కన్ స్ట్రక్షన్’ పేరిట రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలిసింది.లావాని పట్టా భూములు అమ్మడానికి వీల్లేదని రెవెన్యూ అధికారులకు తెలుసు. మరోవైపు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? అనేది ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్..

చాలా మంది రైతులు, వ్యాపారులు, సామాన్యుల భవనాలు, భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయి. రెండేళ్లుగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పని కాలేదని కొందరు చెబుతున్నారు. 22ఏ నుంచి భూములను బయటకు ఎలా తీయాలో ఇంకా తమకు మార్గదర్శకాలు రాలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మాత్రం చందనవల్లిలో లావని పట్టా భూమిని కొనుగోలు చేయడం, వెంటనే రిజిస్ట్రేషన్ చేయించడం కూడా చకాచకా జరిగిపోయాయి.

TG : 22ఏ చల్తా.. చందనవల్లిలో సీఎం రేవంత్ సోదరుడి భూ దందా..!

ఎకరం రూ. 5 కోట్లు..

షాబాద్ మండల కేంద్రం పరిధిలోని చందనవల్లిలో ప్రస్తుతం ఎకరం రూ.5 కోట్లు పలుకుతోందని తెలిసింది. ప్రస్తుతం అక్కడ వేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఐటీ, తయారీ కంపెనీలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ సోదరుడు అక్కడ భూ దందాకు తెరలేపినట్టు సమాచారం. పేదలు, మధ్యతరగతి ప్రజలను బెదిరించి తక్కవ ధరకే రూ. కోట్లు పలికే భూములను తన వశం చేసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే కేవలం రూ.70 లక్షలకు 4.2 ఎకరాలను సీఎం రేవంత్ సోదరుడు సేల్ డీడ్ చేయించుకున్నట్టు తెలిసింది. చేవెళ్ల నవనీత (W/O) చేవెళ్ల స్వామి నుంచి ఈ భూమిని కొనుగోలు చేసిననట్టు ల్యాండ్ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఇప్పటికే డబ్బులు కూడా ముట్టినట్టు అందులో పేర్కొన్నారు. జూన్ 10, 2026న భూమి సేల్ డీడ్ జరిగింది. ఇదంతా చాలా గుట్టుగా నడిచినట్టు సమాచారం.22ఏ, అసైన్డ్ ల్యాండ్ అని తెలిసినా అధికారులు సీఎం రేవంత్ సోదరుడు అని రూల్స్ పక్కన పెట్టి చకాచకా పనులు చేసి పెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్లు తీసుకుని బడా బాబులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్న అధికారులు.. సామాన్యలను మాత్రం ముప్పు తిప్పలు పెడుతున్నట్టు తెలిసింది.

TG : 22ఏ చల్తా.. చందనవల్లిలో సీఎం రేవంత్ సోదరుడి భూ దందా..!

ఆర్ 9 కన్‌స్ట్రక్షన్ పేరిట రిజిస్ట్రేషన్..

సీఎం రేవంత్ సోదరుడు కృష్ణా రెడ్డి భూ బాగోతాన్ని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ బయటపెట్టారు. ఇవాళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘సీఎం రేవంత్‌ సోదరుడు 22-A నిషేధిత భూమిని రిజిస్టర్ చేసుకున్నారు. సర్వే నం.363లోని అసైన్డ్ భూముల జాబితాలో ఆ ల్యాండ్ ఉంది. R9 కన్‌స్ట్రక్షన్ పేరుతో అసైన్డ్ భూమి రిజిస్టర్ అయ్యింది. R9 కన్‌స్ట్రక్షన్ పేరు మీదే సేల్ డీడ్ కూడా జరిగింది. R9 యజమాని అనుముల కృష్ణారెడ్డి. 22-A భూముల విషయంలో సీఎం రేవంత్‌ సోదరుడి రియల్ ఎస్టేట్ మాఫియా ’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అది కాస్త వైరల్ అవుతోంది.

ఇదిలాఉండగా, గతంలో ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి మరో సోదరుడు కొండల్ రెడ్డికి రూ.200 కోట్ల విలువైన స్థలాన్ని రూ.5 కోట్లకే ‘టెస్సరాక్ట్ డిఫెన్స్ కంపెనీ’కి ప్రభుత్వం కేటాయించిందని మన్నె క్రిశాంక్ ఆరోపించారు. టెస్సరాక్ట్ కంపెనీకి అనుముల కొండల్ రెడ్డి ఓనర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ కుటుంబం భారీగా దోపిడీకి పాల్పడుతోందని ముందు నుంచి ఆరోపిస్తున్న మన్నె క్రిశాంక్ .. క్రమేణా ఆధారాలను బయటపెడుతున్నారు.కాగా, దీనిపై ఇప్పటివరకు సీఎం రేవంత్ గానీ, ఆయన కుటుంబం గానీ స్పందించకపోవడం గమనార్హం.కాగా, రేవంత్ బ్రదర్స్ భూ దోపిడీపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు రూ. కోట్లు విలువ చేసే స్థలాలు ఎలా వచ్చాయని, సీఎం రేవంత్ సోదరుల భూబాగోతంపై విచారణ జరిపించాలని నెటిజన్లు సైతం డిమాండ్ చేస్తున్నారు.

#Cm revanth reddy#Anumula krishnareddy#telangana#lands business#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి