సినిమా

Senior Heroes: సీనియర్ హీరోలు అస్సలు తగ్గట్లేదుగా..వీళ్లకి పాన్ ఇండియా క్రేజ్ అవసరం లేదు

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Senior Heroes: సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున..ఇప్పుడు బాక్సాఫీస్ సందడంతా ఈ సీనియర్ హీరోలదే కనిపిస్తోంది. వరుసబెట్టి ఒక్కో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దుమ్మురేపుతున్నారు. వీరితో పోల్చుకుంటే నెక్స్ట్ జనరేషన్ హీరోలు చాలా వెనకబడి ఉన్నారు. కారణం, వాళ్ళు పాన్ ఇండియా సినిమా వెనకాల పరిగెత్తడమే.

Senior Heroes: సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున..ఇప్పుడు బాక్సాఫీస్ సందడంతా ఈ సీనియర్ హీరోలదే కనిపిస్తోంది. వరుసబెట్టి ఒక్కో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దుమ్మురేపుతున్నారు. వీరితో పోల్చుకుంటే నెక్స్ట్ జనరేషన్ హీరోలు చాలా వెనకబడి ఉన్నారు. కారణం, వాళ్ళు పాన్ ఇండియా సినిమా వెనకాల పరిగెత్తడమే.

జైలర్ 2తో బాక్సాఫీస్ కింగ్:

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల వచ్చిన జైలర్ 2 మూవీతో తమిళ చిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాస్తున్నారు. ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి ప్రతీరోజూ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతోంది. రజినీ ఏజ్‌కి ఈ రేంజ్ స్పీడ్ లో సినిమా చేయడం అంటే ఎంతో గొప్ప విషయం. ఒక సినిమా పూర్తవుతుందో లేదో.. ఇంకో సినిమా సెట్స్‌పైకి తెస్తున్నారు. అందరూ, జైలర్ 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంటే, రజినీ మాత్రం ధర్మన్ సెట్స్‌లో ఎంజాయ్ చేస్తున్నారు.

మెగాస్టార్-గాడ్ ఆఫ్ మాసెస్:

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ టాలీవుడ్‌లో ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న సీనియర్ హీరోలు. మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో 300 కోట్ల క్లబ్‌లో చేరారు మెగాస్టార్. ప్రస్తుతం, ఆయన కాకా చిత్రాన్ని సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. బాబీ దర్శకుడు. మరో వైపు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమా తర్వాత సినిమాను లైన్‌లో పెడుతున్నాడు. దాదా చిత్రాన్ని ఈ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అలాగే, కొరటాల శివ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.

వెంకీమామ ఊపు వేరే లెవల్:

గత నాలుగైదేళ్ళుగా వెంకటేష్ వరుస హిట్స్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్‌గారు..ఇలా బ్లాక్ బస్టర్స్‌తో హైపర్ యాక్టివ్‌గా ఉన్న వెంకీ, మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీస్టారర్ చేస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి చేస్తున్న జనవరి 12 విడుదల అదే రోజున రిలీజ్ కాబోతోంది. ఖచ్చితంగా, ఈ సినిమాతోనూ వెంకీ ఖాతాలో బ్లాక్ బస్టర్ ఖాయమని ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో అర్థమవుతోంది. ఇక, ఈ 30వ తేదీన ఆదర్శకుటుంబం అంటూ ఫ్యామీ ఆడియన్స్ కోసం వస్తున్నాడు వెంకీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.

నాగ్ కొంచం స్లో గానీ..గ్యాప్ లేదు:

పైన చెప్పిన సీనియర్ హీరోలతో పోల్చుకుంటే నాగార్జున హీరోగా కాస్త స్లో అయ్యాడు. కానీ, క్యారెక్టర్స్‌తో మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఆకట్టుకుంటున్నాడు. ధనుష్ తో కుబేరా, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కూలీ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించి మెప్పించాడు నాగ్. ఇప్పుడు, తన కెరీర్ బిగ్ మైల్ స్టోన్ మూవీ కింగ్ 100 ను ఈ డిసెంబర్‌కి రెడీ చేస్తున్నాడు. ఇలా, మన సినీయర్ హీరోలు వేగంగా సినిమాలు చేస్తున్నప్పటికీ, ప్రభాస్..రామ్ చరణ్, ఎన్‌టిర్ లాంటి వాళ్ళు మాత్రం కనీసం రెండేళ్ళకి కూడా ఒక సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నారు.

#Megastar Chiranjeevi#Rajinikanth#Balakrishna#Venkatesh#Nagarjuna
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి