సినిమా

అప్పుడు సమంత-నాగ చైతన్య, ఇప్పుడు విజయ్-రష్మిక!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

టాలీవుడ్ స్టార్ కపుల్స్ గనక కలిసి సినిమా చేస్తే, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అదే, రెమ్యునరేషన్. అంతేకాదు, ఇద్దరి డేట్స్ కూడా కలిసి ఇచ్చేయొచ్చు. దీని, వల్ల వీరికి సంబందించిన షూట్ మొత్తం ఏకాధాటిగా పూర్తి చేసుకొని ఇంకో సినిమాకి డేట్స్ సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పుడు, టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న అదే చేస్తున్నారట.

టాలీవుడ్ స్టార్ కపుల్స్ గనక కలిసి సినిమా చేస్తే, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అదే, రెమ్యునరేషన్. అంతేకాదు, ఇద్దరి డేట్స్ కూడా కలిసి ఇచ్చేయొచ్చు. దీని, వల్ల వీరికి సంబందించిన షూట్ మొత్తం ఏకాధాటిగా పూర్తి చేసుకొని ఇంకో సినిమాకి డేట్స్ సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పుడు, టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న అదే చేస్తున్నారట.

గీత గోవిందం నుంచి ఫ్రెండ్స్:

రష్మిక మందన్న 'ఛలో' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈ క్రమంలోనే, విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం' సినిమాను చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఈ సినిమా తర్వాత మళ్ళీ కలిసి సినిమా చేస్తారని..ఈ కాంబినేషన్ సెట్ చేస్తారని ఎవరూ అనుకోలేదు.

డియర్ కామ్రేడ్‌తో ప్రేమ:

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రెండవ సినిమాగా డియర్ కామ్రేడ్ చేశారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. లైగర్ సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువగా ముంబై వీధుల్లో కలిసి ఈ జంట కనిపించింది. అప్పటికే, వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. కానీ, ఎవరి వైపు నుంచి కూడా హింట్ రాలేదు. ఇక, ఇటీవల వీరిద్దరు ఘనంగా పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్ళి తర్వాత వస్తోన్న 'రణబాలి':

విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి రణబాలి సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. అయితే, ఈ సినిమా అగ్రిమెంట్ సమయంలో ఇద్దరు కలిసి 30 కోట్ల రెమ్యునరేషన్‌కి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అప్పటి వరకూ ఒక్కొక్కరు సపరేట్‌గా తమ రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారు. కానీ, రణబాలి సినిమాకి మాత్రం ముందుగానే ఈ కపుల్ కాంబోలో రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారట. అలా, వీరిద్దరి రెమ్యునరేషనే 30 కోట్లని టాక్ వినిపిస్తోంది.

మజిలీ సినిమాకి సమంత-చైతూ కూడా ఇలాగే:

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మజిలీ. ఈ సినిమాకి ముందే నాగ చైతన్య, సమంతలకి పెళ్ళి జరిగింది. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటించిన మొదటి సినిమా కాబట్టి, కలిసే నిర్మాతల వద్ద రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారట. ఇప్పుడు, అదే రణబాలి సినిమాకి రష్మిక-విజయ్ 30 కోట్ల భారీ మొత్తాన్ని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమా కాబట్టే 30 కోట్లకి మైత్రీ వారు కూడా ఓకే అన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దసరా సీజన్‌లో దిగుతున్న ఈ సినిమాతోనైనా విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

#Vijay Devarakonda#Rashmika Mandanna#Ranabaali#Rahul Sankrityan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి