సినిమా

Tollywood: కొందరు దర్శకులు చేస్తున్న తప్పే అది!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: దర్శకుడు అన్న తర్వాత అన్నీ జానర్ సినిమాలను చేయగల సత్తా ఉండాలి. అందరు హీరోలతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో ఆర్జీవీ గ్రేట్ అని చెప్పాలి. ఆయన అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ తో సినిమా చేశారు. సునీల్ లాంటి చిన్న హీరోతోనూ సినిమా తీశాడు. అంతేకాదు, అసలు క్రేజ్ లేని వాళ్ళతోనూ సినిమాలు తీశాడు.

Tollywood: దర్శకుడు అన్న తర్వాత అన్నీ జానర్ సినిమాలను చేయగల సత్తా ఉండాలి. అందరు హీరోలతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో ఆర్జీవీ గ్రేట్ అని చెప్పాలి. ఆయన అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ తో సినిమా చేశారు. సునీల్ లాంటి చిన్న హీరోతోనూ సినిమా తీశాడు. అంతేకాదు, అసలు క్రేజ్ లేని వాళ్ళతోనూ సినిమాలు తీశాడు.

ఆర్జీవికి సినిమా తీయడం ముఖ్యం. అది స్టార్ హీరోనా, అప్‌కిమింగ్ హీరోనా అని చూడరు. ఆ కథకి ఎవరు సరిపోతారు.. వారు అందుబాటులో ఉన్నాడా లేడా..అంతే. ఆర్జీవీ చేసినన్ని ప్రయోగాలు ఇంకో దర్శకుడు చేయలేదు. అందుకే, ఇప్పుడు ముంబైలో ఉన్న చాలామంది ఆయన వద్ద వర్క్ చేసిన వాళ్ళే. వీరిలో దర్శకులున్నారు..సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్..ఇలా దాదాపు అన్నీ డిపార్ట్మెంట్స్ లోనూ ఉన్నారు.

కానీ, కొందరు దర్శకులు ప్రతీ సినిమాను స్టార్ హీరోతోనే చేయాలని పట్టుపట్టి కూర్చుంటారు. అందుకే, వీరికి అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సైతం..ప్రభాస్, ఎన్‌టిర్, రామ్ చరణ్, రవితేజ, మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్స్‌తో సినిమాలు తీశాడు. అలాగే, నాని..సునీల్ లాంటి వారితోనూ సినిమా తీశాడు. హిట్స్ తప్ప జక్కన్న ఖాతాలో ఫ్లాప్ లేదు.

కానీ, స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి మాత్రం ముందు నుంచి అగ్ర హీరోలతోనే సినిమా చేయాలని కూర్చున్నాడు. ఇండస్ట్రీకొచ్చిన 20 ఏళ్ళలో ఆయన తీసింది 10 సినిమాలే. వాటిలో రవితేజ, కళ్యాణ్ రామ్, ఎన్‌టిర్, రామ్ చరణ్, మెగాస్టార్, అల్లు అర్జున్ లాంటి వారితో చేశాడు. అంతేకానీ, మిడ్ రేంజ్ హీరోలతో మాత్రం సినిమా చేయలేదు. ఆయన చేసిన హీరో ఒక్క అఖిల్ మాత్రమే. ఆ సినిమా డిజాస్టర్. పవన్ కళ్యాణ్ తో సినిమా అవకాశం వచ్చింది. కానీ, అది నిలబెట్టుకోలేకపోతున్నాడని అంటున్నారు. అలా కాకుండా చిన్న, మీడియం, బిగ్ స్టార్స్‌తో గనక సినిమాలు చేసి ఉంటే ఆ ట్రాక్ రికార్డ్ ఇంకోలా ఉండేది.

#Tollywood#Tollywood Directors#Surender Reddy#Rajamouli#Ram Gopal Varma
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి