National

Sonam Wangchuk: 24 గంటల్లో వదలకపోతే నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్

రచన: Mahesh•••4 నిమిషాల పఠనం

Sonam Wangchuk: ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అన్‌డిక్లేర్డ్ ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ఆరోపణలు చేశారు.

Sonam Wangchuk: ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అన్‌డిక్లేర్డ్ ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ఆరోపణలు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో తలపెట్టిన నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపి కీలక నాయకులను అదుపులోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టయిన నేతలను 24 గంటల్లోగా విడుదల చేయకపోతే తాను స్వయంగా నిరాహార దీక్ష లేదా పాదయాత్ర చేపట్టే ఆలోచన చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇదేనా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం?

ఢిల్లీలో చోటుచేసుకున్న హైడ్రామాపై సోషల్ మీడియా వేదికగా సోనమ్ వాంగ్‌చుక్ రియాక్ట్ అయ్యారు. "శాంతియుతంగా, ఐక్యంగా ఉండాలని నిరసనకు ముందే పిలుపునిచ్చాం. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్‌లో ఇలాంటి నిర్బంధాలు ఎదురవుతాయని కలలో కూడా ఊహించలేదు. అధికారికంగా ఎమర్జెన్సీ విధించకపోయినా, క్షేత్రస్థాయిలో అచ్చం అలాంటి భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి" అని ఆయన మండిపడ్డారు.

జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. 24 గంటల డెడ్‌లైన్!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ తలపెట్టిన ఆందోళనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడమే కాకుండా, విమానాశ్రయం, ఇతర ప్రాంతాల్లో కీలక నాయకులైన అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అదుపులోకి తీసుకున్నారు. సర్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఈ నిరసన చేపట్టారు.

పోలీసుల తీరుపై విరుచుకుపడ్డ వాంగ్‌చుక్.. అదుపులోకి తీసుకున్న నేతలను తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల వ్యవధిలో వారిని విడిచిపెట్టకపోతే తాను మరోసారి ఉద్యమ బాట పడతానని, ఆమరణ నిరాహార దీక్ష లేదా పాదయాత్రతో నిరసన సెగను మరింత పెంచుతానని స్పష్టం చేశారు. దీంతో కేంద్రం, ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

#Sonam Wangchuk#Delhi Protest#Sonam Wangchuk Protest#Hunger Strike#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి