National

US: ట్రంప్ డబుల్ గేమ్! రష్యాతో అమెరికా డిజిల్ డీల్..

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

US: అంతర్జాతీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న డబుల్ గేమ్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు బట్టబయలైంది. ఉక్రెయిన్ సంక్షోభం సాకుతో రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై అదనపు పన్నులు వేసిన అగ్రరాజ్యం.. సొంత దేశంలో తిప్పలు మొదలయ్యేసరికి అదే మాస్కో కాళ్ల వద్దకు చేరింది. ఏకంగా రష్యా నుంచే డీజిల్ కొనుగోలు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం డీల్ కుదుర్చుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని అవాక్కయ్యేలా చేసింది.

జనానికి నీతులు.. సొంతానికి డీజిలా

రష్యా నుంచి ముడి చమురు కొనడం వల్ల పుతిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నారంటూ గత కొద్ది నెలలుగా ట్రంప్ గగ్గోలు పెట్టారు. భారత్‌పై ఏకంగా 25 శాతం అదనపు సుంకాలు విధించడమే కాకుండా, రష్యా ఇంధనాన్ని ముట్టుకుంటే 100 శాతం పన్నులు బాదుతామంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచాన్ని బెదిరించారు. కానీ భారత్ తన జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పి కొనుగోళ్లు కొనసాగించింది. "మాపై పగబట్టిన దేశాలే తెరవెనుక రష్యాతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి" అని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నాడు చేసిన వ్యాఖ్యలు అక్షరాలా నిజమని ఇప్పుడు తేలిపోయింది.

గ్యాలన్ 6 డాలర్లకు ఎగబాకడంతో ట్రంప్ దిగిరాక తప్పలేదు

ఇరాన్‌తో వివాదాలు, సరఫరా గొలుసులో అంతరాయాలతో అమెరికాలో డీజిల్ ధర గ్యాలన్‌కు రికార్డు స్థాయిలో 6 డాలర్లు దాటింది. దీంతో ట్రక్కు యజమానులు, రైతులు, సామాన్య పౌరుల నుంచి ట్రంప్ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటమి భయం వెంటాడటంతో ట్రంప్ రాత్రికి రాత్రే అసలు రంగు బయటపెట్టారు.

రష్యా డీజిల్‌పై ఉన్న నిషేధాన్ని ఏప్రిల్ 2027 వరకు ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి, నేరుగా మాస్కో నుంచే డీజిల్ కొనుగోలుకు తెరలేపారు. ప్రపంచాన్ని నియంత్రించాలనుకునే అగ్రరాజ్యం.. తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతుందనడానికి ట్రంప్ కుదుర్చుకున్న ఈ రహస్య డీజిల్ డీలే నిదర్శనమంటూ దౌత్య నిపుణులు దుమ్మెత్తిపోస్తున్నారు.

#Donald Trump#United States#Russia#Russia US Relations#Russian Diesel Imports#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి