తెలంగాణ

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎల్ నినోపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

రచన: Mahesh•••5 నిమిషాల పఠనం

TG: తెలంగాణలో కరువు పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో రైతులు, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్వేచ్ఛ న్యూస్ వరుస కథనాలు రాసింది. పంటలు పండించడానికి చుక్కనీరు లేక రైతులు పడుతున్న అవస్థలు కళ్ళకు కట్టినట్టు వివరించింది. పెరిగిన ధరలు, బతుకు భారంతో సతమతమవుతున్న సామాన్య జనాల ఆవేదనను అద్దం పట్టినట్టు వరుస కథనాలతో స్వేచ్ఛ ప్రచురించడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

TG: తెలంగాణలో కరువు పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో రైతులు, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్వేచ్ఛ న్యూస్ వరుస కథనాలు రాసింది. పంటలు పండించడానికి చుక్కనీరు లేక రైతులు పడుతున్న అవస్థలు కళ్ళకు కట్టినట్టు వివరించింది. పెరిగిన ధరలు, బతుకు భారంతో సతమతమవుతున్న సామాన్య జనాల ఆవేదనను వరుస కథనాల్లో ప్రచురించింది. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని, చర్యలు చేపట్టడం లేదని విమర్శిస్తూనే.. ఇందుకు ఏమేం చేయాలో కూడా సూచనలు సలహాలతో స్వేచ్ఛ వివరించింది. ఎట్టకేలకు స్వేచ్ఛ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తబోయే పరిస్థితులపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయో.. ఎల్‌నినో కారణంగా భవిష్యత్తులో రాష్ట్రంలో అలాంటి గండమే పొంచి ఉందని హెచ్చరించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎల్ నినోపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

మార్కెట్‌లో కరెంటే లేదు..

ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఓ ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. "విద్యుత్ సమస్య అత్యంత తీవ్రతరం కాబోతోంది. ప్రజల కోసం ఎంత డబ్బైనా వెచ్చించి కరెంట్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ సమస్యల్లా.. కొందామన్నా బయట మార్కెెట్ లో విద్యుత్ అందుబాటులో లేదు" అని ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టారు.

డబ్బులున్నా కరెంట్ దొరకని విపత్కర పరిస్థితులు రానున్నాయని హెచ్చరించిన ఆయన, కరెంట్‌ను అత్యంత పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, విద్యుత్ ఎక్కువగా వినియోగించే ప్రాజెక్టులు, పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

చుక్క నీరు కూడా వృథా కావొద్దు

ఇప్పటి నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో పెను సవాళ్లు ఎదురుకానున్నాయని సీఎం స్పష్టం చేశారు. "ఎల్‌నినోతో రాబోయే ముప్పును ఇప్పుడే పసిగట్టి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కొవిడ్‌ విపత్తును ఎలాగైతే యుద్ధ ప్రాతిపదికన ఎదుర్కొన్నామో.. ఎల్‌నినో సంక్షోభాన్ని కూడా అదే తరహా పకడ్బందీ యాక్షన్ ప్లాన్‌తో ఎదుర్కోవాలి" అని దిశానిర్దేశం చేశారు.

చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని.. సినిమా తారలు, మీడియా, కళాజాతాల ద్వారా గ్రామస్థాయి నుంచి ప్రజలందరినీ ఈ పోరాటంలో భాగస్వాములను చేసి చైతన్యవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం చేసిన ఈ ప్రకటనతో అంతటా ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో కరెంట్, తాగునీటి సంక్షోభం భయపెడుతోంది.

#Telangana News#CM Revanth Reddy#El Niño Effect#Telangana Drought#Power Shortage#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి