క్రైమ్

ఏపీలో అస్సాం యువతి అనుమానాస్పద మృతి.. రైల్వే ట్రాక్ పక్కన డెడ్‌బాడీ.. అసలేం జరిగింది?

రచన: NK•••6 నిమిషాల పఠనం

అస్సాంకు చెందిన యువతి ఆంధ్రప్రదేశ్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ట్రాక్ పక్కన యువతి డెడ్ బాడీ లభించింది. అస్సాం యువతి హిమశ్రీ బోరో మరణం ఏపీలో సంచలనంగా మారింది. యవతి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిమశ్రీ డెత్ మిస్టరీ చేధించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏపీ, అస్సాం ప్రభుత్వాలు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాయి.

Himashree Boro: అస్సాంకు చెందిన యువతి ఆంధ్రప్రదేశ్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ట్రాక్ పక్కన యువతి డెడ్ బాడీ లభించింది. అస్సాం యువతి హిమశ్రీ బోరో మరణం ఏపీలో సంచలనంగా మారింది. యవతి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిమశ్రీ డెత్ మిస్టరీ చేధించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏపీ, అస్సాం ప్రభుత్వాలు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాయి.

విచారణకు అస్సాం సీఎం ఆదేశం

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాలతో ఆ రాష్ట్రానికి చెందిన ఐజీ శివప్రసాద్ శ్రీకాకుళం చేరుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 7 పోలీసు బృందాలు దర్యాఫ్తు చేస్తున్నాయి. హిమశ్రీ విగతజీవిగా పడి ఉన్న పెనుబర్తి, బొడ్డేపల్లి రైల్వే ట్రాక్ ను అస్సాం ఐజీ, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. హిమశ్రీ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

భయంతో జారిపడిందా? తోసేశారా?

ఈ నెల 6వ తేదీన వివేక్ ఎక్స్ ప్రెస్ లో విశాఖ నుంచి అస్సాం వెళ్తూ అనుమానాస్పదంగా మరణించింది హిమశ్రీ. ఈ నెల 7న శ్రీకాకుళం జిల్లా పెనుబర్తి శివారులో రైల్వే ట్రాక్ పక్కన ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. యువతి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిందా? భయంతో రైలు నుంచి దూకేసిందా? లేక ఎవరైనా తోసేశారా? అనే కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఎంక్వైరీ జరుగుతోంది.

యువతి మృతిపై అనుమానాలు

హిమశ్రీ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. అటు అస్సాంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాంతో హిమశ్రీ అనుమానాస్పద మృతిపై విచారణకు ఆదేశించారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. కాగా, ట్రైన్ లో ఇబ్బందికర పరిస్థితి ఉందంటూ ఫోన్ లో వీడియో తీసి తన ఫ్రెండ్ కి పంపింది హిమశ్రీ. ఆ వీడియోను పోలీసులు పరిశీలించారు.

''ఆరోజు హిమశ్రీతో పాటు రైలు బోగీలో ప్రయాణం చేసిన ప్రతి ప్రయాణికుడిని కాంటాక్ట్ చేస్తున్నాం. ఇది యాక్సిడెంటల్ గా జరిగిందా? లేక ఎవరైనా తోసేశారా? అనే కోణాల్లో దర్యాఫ్తు జరుగుతోంది. ప్రిలిమినరీ పోస్టుమార్టం ప్రకారం.. లైంగిక దాడి కానీ భౌతిక దాడి కానీ జరిగినట్లు లేదు. ఫైనల్ పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది.

వీడియోలో అలాంటిదేమీ లేదంటున్న పోలీసులు

యువతి తన ఫ్రెండ్ కి పంపిన వీడియోలోనూ ఇబ్బందికరంగా ఏమీ లేదు. తను నిల్చుని ఉంది. పక్కన కొంతమంది ఉన్నారు. కింద కొంతమంది కూర్చుని ఉన్నారు. తన బోగీలో రష్ ఎక్కువగా ఉందని తెలుపుతూ వీడియో రికార్డ్ చేసి పంపింది. క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల తనకు కొంచెం భయంగా ఉందని ఫ్రెండ్ కి చెప్పింది. ఆ బోగీలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. కానీ, ఎక్కువగా పురుషులు ఉన్నారు. బోగీలో రిజర్వేషన్ 35 మందికి మాత్రమే ఉంది. మిగతా వారంతా రిజర్వేషన్ లేని వారే. వారిలో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు.

అయితే బోగీలో అక్కడ ఏదో ఇష్యూ అయినట్లు కానీ, ఎవరైనా ఆమెను ఇబ్బంది పెట్టినట్లు కానీ, గొడవ జరిగినట్లు కానీ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. కాగా, యువతి బాడీని గుర్తించడం ఆలస్యమైంది. మృతదేహం ట్రాక్ కి కొంచెం కింద ఉండటం వల్ల ఇలా జరిగింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది'' అని పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

#Himashree Boro#Andhra Pradesh#Srikakulam#Railway Track#Dead Body#Swechaa News#Assam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి