తెలంగాణ

MLC Elections: ఇదేనా పొత్తు ధ‌ర్మం టీడీపీని నిలదీస్తున్న జ‌న‌సేన!!..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

రాజకీయాల్లో ఎదగాలంటే ఒదిగి ఉండాలనే నానుడి పాతదైపోయింది. ఇప్పుడు ఎదుటి వారిని తొక్కేయాలి, ఎన్నో అబద్ధాలు ఆడాలి.. అందితే కాళ్ళు అందకుంటే జుట్టు పట్టుకోవాలి.. లేదంటే తమ తప్పులు దాచి ఎదుటి వారి తప్పులను గట్టిగా ప్రచారం చేయాలి..

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, అలాగని శాశ్వత శత్రువులు అంతకంటే ఉండరు.. కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా నేతలు ముందుకు సాగడం కనిపిస్తుంది. ఇక రాజకీయాల్లో ఎదగాలంటే ఒదిగి ఉండాలనే నానుడి పాతదైపోయింది. ఇప్పుడు ఎదుటి వారిని తొక్కేయాలి, ఎన్నో అబద్ధాలు ఆడాలి.. అందితే కాళ్ళు అందకుంటే జుట్టు పట్టుకోవాలి.. లేదంటే తమ తప్పులు దాచి ఎదుటి వారి తప్పులను గట్టిగా ప్రచారం చేయాలి.. ఈ ట్రెండ్ ఫాలో అయిన పార్టీలు అధికారంలోకి రావడం తెలిసిందే..

ప్రస్తుతం ఈ సత్యం మరోసారి నిరూపితమవుతోందనే టాక్ వినిపిస్తుంది. ఏపీలో అధికార కూటమిగా కలిసి సాగుతున్న తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు సెగలు పుట్టిస్తున్నాయని చర్చలు మొదలైయ్యాయి.. ఈ ఎన్నికల రాజకీయం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాష్ట్రంలో పార్టీ ఉనికిని చాటాలని, ప్రజల నాడిని బేరీజు వేసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తపిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఈ ఎన్నికలను జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి జనసేన తరఫున డాక్టర్ గడల శ్రీనివాసరావుని బరిలో నిలిపారు. అయితే, ఇక్కడే అసలు వివాదం మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల వైపు టీడీపీ మొగ్గుచూపుతుండటం, ఆ పార్టీకి మద్దతు ఇస్తుండటంపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

తమ మద్దతు వల్లే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు సీఎం కాగలిగారనే బలమైన భావన జనసేన నేతల్లో ఉంది. మరి అలాంటప్పుడు, పొత్తు ధర్మం ప్రకారం తెలంగాణలో తమ అభ్యర్థికి టీడీపీ బహిరంగంగా మద్దతు పలకాలి కదా అని జనసేన నాయకులు నిలదీస్తున్నారు. ఇప్పటికీ టీడీపీకి, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. అక్కడ టీడీపీ మద్దతు లభిస్తే తమ అభ్యర్థికి ప్రయోజనం చేకూరుతుందని జనసేన ఆశిస్తుంది..

కానీ, గతంలో ఉన్న స్నేహ బంధాన్ని మరచిపోలేని టీడీపీ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ వైపు నడుస్తుండటంతో జనసేన క్యాడర్‌కు మింగుడుపడటం లేదు. పవన్ కళ్యాణ్ మీద కనీస కృతజ్ఞత కూడా చూపకుండా టీడీపీ వ్యవహరిస్తోందని ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. మొత్తానికి చూస్తే.. ఏపీ రాజకీయ సమీకరణాలు వేరు, తెలంగాణ రాజకీయ వాస్తవాలు వేరని ఈ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

రేవంత్ రెడ్డి కంటే పవన్ తమకు ఎక్కవ కాదనే సంకేతాలను టీడీపీ తన చర్యల ద్వారా పంపుతోందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇక భవిష్యత్తులో కూటమి ప్రయాణంపై ఈ ఆరోపణలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి..

#telangana-news#janasena-leaders#fire-on-tdp#political News#TDP Janasena alliance#Janasena questions TDP#Telangana MLC Elections
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి