తెలంగాణ

TCongress Incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్ ఉన్నట్టా? లేనట్టా?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

TCongress Incharge: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఓ విచిత్రమైన రాజకీయ సందిగ్ధత నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల నిరీక్షణకు మాత్రం తెరపడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్య వారధిగా ఉండే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పాత్ర అత్యంత కీలకం. అయితే ప్రస్తుతం రాష్ట్ర పార్టీకి ఆ స్థాయి పెద్దదిక్కు ఉన్నారా లేరా అన్న చర్చ గాంధీ భవన్‌లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

విదేశీ చదువులో ఇన్‌ఛార్జ్..

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నెల రోజుల క్రితం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. ఆమె విదేశాలకు వెళ్లి ఇంతకాలమైనా అధిష్టానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయకపోవడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఆమె విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలను అక్కడి నుంచే పర్యవేక్షించే వెసులుబాటును అధిష్టానం ఇచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మూడు జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకానికి ఆమె విదేశాల నుంచే ఆమోదం తెలిపినప్పటికీ, అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవులు, ఇతర ప్రాధాన్య పోస్టుల భర్తీ విషయంలో విదేశాల్లో ఉంటూ సమగ్ర నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కొత్త ఇన్‌ఛార్జ్ వస్తారా?

మరోవైపు మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త ఇన్‌ఛార్జ్‌ను నియమిస్తారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో ఊపందుకుంది. తమిళనాడుకు చెందిన ఓ సీనియర్ నేతకు తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే కొత్త ఇన్‌ఛార్జ్ నియామకం ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఎవరి వద్ద స్పష్టత లేదు. ఒకవేళ కొత్త నేత బాధ్యతలు చేపట్టినా, రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సమీకరణాలపై పట్టు సాధించి తుది నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

దసరా పండుగ వేళ ఆశావహుల్లో దడ

దసరా నాటికి నామినేటెడ్ పోస్టుల పర్వం పూర్తవుతుందని ఇన్నాళ్లూ నాయకులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ఇన్‌ఛార్జ్ లేకపోవడంతో ఆ కసరత్తు మళ్లీ మొదటికే వస్తుందా అన్న భయం మొదలైంది. ఇన్‌ఛార్జ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఢిల్లీ పెద్దలు ఏ జాబితాను ఆమోదించే పరిస్థితి ఉండదు. దీంతో ఈ పండుగ సీజన్‌లోనైనా పదవుల పండుగ ఉంటుందా లేక ఇన్‌ఛార్జ్ కొర్రీలతో మళ్లీ వాయిదాల పర్వం తప్పదా అన్న టెన్షన్ తెలంగాణ హస్తం నేతల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

#Telangana Congress#Telangana Congress News#Meenakshi Natarajan#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి