సినిమా

Bloody Romeo: షాకింగ్ మేకోవర్‌లో నానీ, జడల్ కట్!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Bloody Romeo: టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ గా నానికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇటీవలే, ఈ యంగ్ హీరో ది ప్యారడైజ్ సినిమాతో వచ్చాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సినిమాను రెడీ చేస్తున్నాడు.

Bloody Romeo: టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ గా నానికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇటీవలే, ఈ యంగ్ హీరో ది ప్యారడైజ్ సినిమాతో వచ్చాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సినిమాను రెడీ చేస్తున్నాడు.

యువ దర్శకుడు సుజీత్, నాని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాపై ఇప్పటికే, హైప్ క్రియేట్ అయి ఉంది. ఇక, ఈ సినిమా గురించి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో జడల్ పాత్రలో ఆకట్టుకున్న నాని, ఇప్పుడు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు? అనే ప్రశ్నకు బ్లడీ రోమియో సినిమా సమాధానం కాబోతోంది. ఇప్పటికే, విడుదలైన టైటిల్ ప్రమోషనల్ వీడియోలో నాని ఒకవైపు చెఫ్‌గా, మరోవైపు గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్టు అర్థమైంది.. ఈ కాన్సెప్ట్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్, నాని కొత్త మేకోవర్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ప్యారడైజ్ సినిమాలో రెండు పొడవాటి జడలు వేసుకొని కనిపించిన నానిని సుజీత్..తన కథకు తగ్గట్టుగా డిఫరెంట్ లుక్‌తో మేకోవర్ చేసి తయారు చేసుకున్నాడు. నానీ, మేకోవర్ కి సంబందించిన లేటెస్ట్ వీడియోను వదిలారు. ఈ వీడియోలో సుజీత్ నాని పక్కనే ఉండి..పాత్ర తీరుతెన్నులకి సంబందించిన సూచనలు ఇస్తూ కంప్లీట్ మేకోవర్‌తో నానిని మార్చాడు. స్టైలిష్ ఛెప్ గా నాని కనిపించనున్నాడు.

ఎక్కువగా ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరగనుంది. ఇప్పటికే, అక్కడ లోకేషన్స్ ఫైనల్ చేసి..షెడ్యూల్స్ కూడా రెడీ చేశాడు సుజీత్. ఇంతకముందెన్నడూ లేని విధంగా ప్యారడైజ్ సినిమాకి..బ్లడీ రోమియో సినిమాకి ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి ఫ్యాన్సే అవాక్కవుతున్నారు. సాహో, ఓజీ సినిమాలను హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా రూపొందించి సుజీత్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గ్యాంగ్ స్టర్ సినిమాలను బాగా డీల్ చేస్తాడు. కాబట్టి, నానీ కూడా సుజీత్ మీద నమ్మకం పెట్టుకొని ఓకే చెప్పాడు. మరి, ఈ బ్లడీ రోమియో లుక్ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

#Nani#Sujeeth#Bloody Romeo#Latest Cinema News#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి