సినిమా

Tollywood: అంచనాలు పెంచితే సినిమాకి మైనసే కదా!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Tollywood: కొన్ని సినిమాలకి అంచనాలు పెంచడం అవసరం. కొన్ని సినిమాలకి అసలు ఎలాంటి అంచనాలు పెంచకపోతేనే మంచిది. బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది. ఇలాంటి, మాటలు వినిపించేది మన టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లోనే. అవును..కథా బలం ఉన్న సినిమాకి అంచనాలు పెంచితే అది రెట్టింపు స్థాయిలో వసూళ్ళను రాబడుతుంది. అలా, కాకుండా కథలో అసలు దమ్మే లేకుండా తీసిన సినిమాకి మరింత హైప్ ఇవ్వడం బూడిదలో పోసే పన్నీరే అవుతుంది.

Tollywood: కొన్ని సినిమాలకి అంచనాలు పెంచడం అవసరం. కొన్ని సినిమాలకి అసలు ఎలాంటి అంచనాలు పెంచకపోతేనే మంచిది. బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది. ఇలాంటి, మాటలు వినిపించేది మన టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లోనే. అవును..కథా బలం ఉన్న సినిమాకి అంచనాలు పెంచితే అది రెట్టింపు స్థాయిలో వసూళ్ళను రాబడుతుంది. అలా, కాకుండా కథలో అసలు దమ్మే లేకుండా తీసిన సినిమాకి మరింత హైప్ ఇవ్వడం బూడిదలో పోసే పన్నీరే అవుతుంది.

ఈ మధ్య కాలంలో ఇలా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి వాటిలో కమెడియన్ వేణు ఎల్దండి తీసిన 'బలగం'. అసలు, ఈ టైటిల్ కి కమెడియన్ వేణు తీశాడనే మాటకి, అంతా కొత్తవాళ్ళతో చేసిన ప్రయోగానికి ఏమాత్రం బజ్ లేదు. 'బలగం' సినిమాకి ముందు ఉన్న బలం అంటే నిర్మాత దిల్ రాజు మాత్రమే. కానీ, సినిమా రిలీజైయ్యాక ప్రతీ ఒక్కరినీ ఆలోచింపచేసింది.

నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్:

ఈ మధ్య కాలంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమా కోర్ట్. నాని నిర్మాతగా వచ్చింది ఈ సినిమా. ప్రియదర్శి, శివాజీ కీలక పాత్రల్లో నటించారు. సింపుల్ కోర్ట్ డ్రామా. సొసైటీలో జరుగుతున్న విషయాలే కథ. కాబట్టి, ఇది ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయింది. పైగా నాని విసిరిన ఛాలెంజ్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళింది. కోర్ట్ సినిమా గనక మీకు నచ్చకపోతే నా హిట్ 3 చూడొచ్చు అన్న నాని మాటలు కోర్ట్ సినిమాకి బూస్ట్ అయ్యాయి.

అక్కడే, ఈ సినిమా సక్సెస్ అయింది. నాని చెప్పినట్టుగా మంచ్ని బజ్ క్రియేట్ అయింది...బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కానీ, హిట్ 3 మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఇక, ఇటీవల వచ్చిన టాక్సిక్ సినిమాకి భారీ ఈవెంట్స్ నిర్వహించారు. కాస్ట్ అండ్ క్రూ మొత్తం సినిమాను ఆకాశానికి ఎత్తారు. కట్ చేస్తే పరమ చెత్త సినిమా..అని ట్యాగ్ తగిలించారు. నాని నటించిన ది ప్యారడైజ్ కూడా ఇలాగే. ముందు నుంచి కాస్త నెగిటివ్ టాక్‌తోనే ఊగిసలాడింది. ఎంత హైప్ ఇద్దామనుకున్నా వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కెరీర్‌ను డైలమాలో పడేసింది. ఇలాంటి, సంఘటనలు చాలా జరుగుతున్నాయి. వాస్తవానికి, రవితేజ నటించిన ఇరుముడి సినిమా మీద కూడా అంతగా అంచనాలు లేవు. కాబట్టే, ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

కాకా సినిమాకి హైప్ అవసరమా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా కాకా. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. 2027, సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, తాజాగా థమన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. తగలబెట్టేద్దాం..అని. ఇలాంటి మాటల వల్ల సినిమాపై అభిమానుల్లోనే కాక, కామన్ ఆడియన్స్‌లో అంచనాలు పీక్స్‌కి చేరుకుంటాయి. మెగాస్టార్ లాంటి లెజండ్ సినిమాకి అసలు హైపే అవసరం లేదు. ఇక్కడే, సినిమాలు దెబ్బతింటున్నాయి. గతంలో కూడా థమన్ ఇలా హైప్ ఇచ్చిన సర్కారు వారి పాట, అఖండ 2 లాంటి సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. సినిమా రిలీజ్‌కి ముందు థమన్ ఇలా బూస్ట్ ఇస్తుంటాడు. కానీ, అది అన్ని సినిమాలకి పనిచేయడం లేదు.

#Kaaka#Bobby#Chiranjeevi#SS.Thaman#Anaswara Rajan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి