National

Rahul Gandhi: యువత పోరాటాన్ని చూసి గర్విస్తున్నా.. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం: రాహుల్ గాంధీ

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

Rahul Gandhi: రోడ్లెక్కి నిలదీస్తున్న యువత ధైర్యాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అక్రమ కేసులతోనో, పోలీసుల బెదిరింపులతోనో ప్రజల గొంతు నొక్కడం ఎవరి వల్లా కాదని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆరెస్సెస్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

"హక్కుల రక్షణ కోసం రోడ్డెక్కిన యువత పోరాటం స్ఫూర్తిదాయకం. మోదీ గారూ.. పోలీసులతో భయపెట్టి పది వేల మందినో, యాభై వేల మందినో జైల్లో పెట్టిస్తారా? ఎంతమందిని లోపలేసినా జనం ఆగరు. అందరం ఏకమై మిమ్మల్ని నలువైపులా చుట్టుముట్టేస్తున్నాం. రాజ్యాంగాన్ని కాపాడుకునే దాకా ఎవరూ వెనకడుగు వేయబోరు" అని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

మోడీ, ఆరెస్సెస్ ప్లాన్లను తాను పదేళ్లుగా నిశితంగా గమనిస్తున్నానని, వారి మైండ్‌సెట్ తనకు పూర్తిగా తెలుసని చెప్పారు. గత 10-15 ఏళ్లలో దేశానికి జరిగిన డ్యామేజ్‌ను సరిచేస్తామని, రాజ్యాంగంపై కన్నేసిన పాలకులను ప్రజాశక్తితో ఓడించి తీరుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

#Rahul Gandhi#Indian National Congress#Narendra Modi#RSS#Indian Politics#Youth Protest#swechaa news02514+*/
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి