తెలంగాణ

TG: జూబ్లీహిల్స్‌లో ఆడి కారు యవ్వారం.. తాగిన మైకంలో 4 గంటల హైడ్రామా

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి వేళ భారీ హైడ్రామా చోటుచేసుకుంది. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ లగ్జరీ కారు డ్రైవర్, ఏకంగా నాలుగు గంటల పాటు నడిరోడ్డుపై పోలీసులకే ముచ్చెమటలు పట్టించాడు. కారు దిగడానికి నిరాకరిస్తూ, విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగి తీవ్ర గందరగోళం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

రోడ్ నెం. 36లో అర్ధరాత్రి కలకలం

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన AP 15 BL 0555 నంబర్ ఆడి కారును పోలీసులు ఆపారు. డ్రైవర్‌కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అతడు తాగి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది.

కారు దిగే ప్రసక్తే లేదంటూ 4 గంటల వీరంగం

మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తిని కారు దిగాల్సిందిగా పోలీసులు ఆదేశించగా, అతడు ఏమాత్రం వారికి సహకరించలేదు. కారు దిగేందుకు ససేమిరా అనడమే కాకుండా, డోర్లు వేసుకుని లోపలే కూర్చొని మొండికేశాడు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా, విధుల్లో ఉన్న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఏకంగా నాలుగు గంటల పాటు నడిరోడ్డుపై ఈ హైడ్రామా కొనసాగడంతో ట్రాఫిక్ విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

పోలీసుల ఫిర్యాదు.. ఆడి కారు సీజ్

ఈ ఘటనపై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్ ఆర్ఎస్ఐ మధు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధులకు ఆటంకం కలిగించినందుకు సదరు వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా కంప్లైంట్ చేశారు. అనంతరం రూల్స్ ప్రకారం ఆడి కారును పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో ఖరీదైన కారులో వచ్చి రోడ్డుపై హల్‌చల్ చేసిన ఈ వ్యవహారం ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

#Jubilee Hills#Hyderabad News#Telangana News#Drunk Driving#Audi Car Incident#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి