తెలంగాణ

Siddipet: మానవత్వం మరచిన గజ్వేల్ ఎమ్మార్వో.. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా?.. పురుగుల మందు తాగలేదా?..

రచన: Venu••5 నిమిషాల పఠనం

అన్నదాత సుఖీభవ అంటాం.. దేశానికి వెన్నెముక రైతు అంటాం. కానీ అదే రైతు తన గోడును వెళ్లబోసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే.. అతనికి ఎదురయ్యే చేదు అనుభవాలు ఎన్నో.. పొలంలో కలుపు తీసినంత సులువుగా సమాజంలోని అధికారుల్లో పెరుగుతున్న కలుపును తుంచలేక లోలోన కుమిలి పోయే రైతులు ఎందరో..

లోకంలో తాను తింటున్న అన్నం ఒక రైతు పండించిన పంట నుండి వచ్చిందే అనే ఇంగిత జ్ఞానం రోజురోజు నశిస్తుందని కొందరు అధికారుల తీరు నిరూపిస్తుంది. రైతులు కూడా మనుషులే కదా.. వారికి ఆత్మగౌరవం ఉంటుంది, కన్నీళ్లు ఉంటాయి, కుటుంబ భారాన్ని మోసే బాధ్యత ఉంటుంది. అంతే కాదు భూమిని నమ్ముకుని బతికే ప్రతి రైతుకు సర్వం ఆ భూమినే..

ఇక అన్నదాత సుఖీభవ అంటాం.. దేశానికి వెన్నెముక రైతు అంటాం. కానీ అదే రైతు తన గోడును వెళ్లబోసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే.. అతనికి ఎదురయ్యే చేదు అనుభవాలు ఎన్నో.. పొలంలో కలుపు తీసినంత సులువుగా సమాజంలోని అధికారుల్లో పెరుగుతున్న కలుపును తుంచలేక లోలోన కుమిలి పోయే రైతులు ఎందరో.. తాజాగా తన సమస్య పరిష్కరించుకుందామని ఓ అధికారి దగ్గరకు వెళ్తే అతను ఆ కర్షకున్ని అవహేళన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మార్వోకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన రైతుతో అధికారి మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి కోల్పోతున్నానని, బ్రతుకుదెరువు ప్రశ్నార్థకమైందని తన గోడు వెళ్లబోసుకోవడానికి వెళ్లిన ఓ సామాన్య రైతును చూసిన ఎమ్మార్వో.. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా.. అంటూ ప్రశ్నించడం సంచలనంగా మారింది.

ఆవేదనతో ఆశ్రయించిన వ్యక్తిని ఆదుకోవాల్సింది పోయి, నా పరిస్థితి చూస్తే మీకు నవ్వు వస్తుందా? అని ఆ రైతు నిలదీస్తే... అవును వస్తది.. బరాబర్ వస్తదని సమాధానం చెప్పడం అతని అధికార దర్పణానికి, అహంకారానికి నిదర్శనం అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం ప్రజల సేవకోసం తప్ప, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కాదు. ఇలాంటి అధికారుల వల్ల వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం సడలిపోతుందనే చర్చలు మొదలైయ్యాయి.

ఇక ఈ సంఘటన కేవలం ఒక ఎమ్మార్వో వైఫల్యం కాదు, బాధ్యతరాహిత్యానికి, మానవత్వం మంట కలిసింది అనడానికి నిలువెత్తు నిదర్శనం అని ఈ వీడియో చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆ అధికారి తీరు అత్యంత హేయమైనదని కామెంట్స్ చేస్తున్నారు.. మరోవైపు కుర్చీలో కూర్చున్నంత మాత్రాన అధికారులు దేవుళ్లు అయిపోరు. కానీ తోటి మనిషి చావును కోరుకునేంత రాక్షసులుగా మారితే మాత్రం.. సమాజం అలాంటి వారిని క్షమించదని అంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఆ అహంకార అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇలాంటి సంఘటనలు మరిన్ని పునరావృతం అయ్యి అవమాన భారంతో రైతులు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు అనే ప్రశ్నలు నెటిజన్స్ సంధిస్తున్నారు..

#TelanganaNews#JusticeForFarmers#GajwelMRO#FarmerProtest#GovernmentApathy#RespectFarmers#ViralVideo#HumanityFirst
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి