వెలుగులోకి బల్మూరు వెంకట్ ఇల్లీగల్ దందా!!
నెలకు లక్షల్లో అక్రమ సంపాదన
కళ్ళు ఉన్న కబోదిలా మారిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
ఈ వ్యవహారం పై అధికారుల మౌనానికి అర్థం ఏంటి మహాశయా?
ఈ ఇల్లీగల్ హోర్డింగ్స్ వ్యాపారంపై సమగ్ర విచారణ అవసరం అంటున్న జనం
బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ నేతలు రాష్ట్రం మొత్తం అవినీతి కంపు పట్టించారని.. అడ్డగోలు దోపిడీకి తెగబడ్డారని ఎన్నికల ప్రచారం నుండి అధికార పీఠం ఎక్కిన తర్వాత కూడా ఆపకుండా నేటివరకు కాంగ్రెస్ నేతలు పాడుతున్న పాట ఇది. ఇక దొంగే దొంగ అన్నట్లు... ఇల్లీగల్ దందాలు చేసేవారే అవినీతిపై లెక్చర్లు ఇవ్వమంటే గంటల తరబడి ఉపన్యాసాలు దంచుతారు కానీ తమ తప్పులపై మాత్రం కిక్కురుమనకుంటా ఉంటారనే విమర్శలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పై వినిపిస్తున్నాయి.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటవుతున్న ఇల్లీగల్ హోర్డింగ్స్, బోర్డుల ద్వారా నెలకు ఏకంగా 15 నుండి 30 లక్షల రూపాయల అక్రమ వసూళ్లు సాగుతున్నాయన్న సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.. ఈ క్రమంలో అసలు సైబరాబాద్ పరిధిలో అధికారిక అడ్వటైజింగ్ పాలసీని ఎందుకు అమలు చేయడం లేదు? ఈ భారీ అవినీతి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి? అనే సందేహాలు మొదలైయ్యాయి..
ఈ నేపథ్యంలో అందరి వేళ్లు బల్మూర్ వెంకట్ వైపు తిరుగుతున్నాయి.. అధికార బలంతో నిబంధనలను తుంగలో తొక్కి, కోట్లలో వ్యాపారం సాగిస్తున్నప్పటికీ దీనిపై ప్రశ్నించాల్సిన నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.. ఎన్నో అవినీతి అక్రమాల గురించి మాట్లాడే నేతల తీరు ఇప్పుడు బల్మూర్ బడా వ్యాపారము గుట్టు విప్పకపోవడంతో వడ్డించేవాడు మనవాడైతే నల్లి బొక్కలన్నీ మనకే అన్నట్టుగా ఉందని అనుకుంటున్నారు..
ఇక ఏదైనా చిన్న వివాదం వస్తే చాలు ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడే వెంకట్ తనపై వస్తున్న ఈ లక్షల రూపాయల ఇల్లీగల్ హోర్డింగ్స్ ఆరోపణల గురించి మాత్రం నోరు విప్పకపోవడం విడ్డూరంగా ఉందని చర్చించుకుంటున్నారు. ముందు ప్రతిపక్షం ఏం చేసిందనే మాటలతో ప్రజలను మభ్యపెట్టే బద్ధులు అధికార పక్ష నేతలు ఎంత తింటున్నారు అనే దానిమీద దృష్టి పెడితే రాష్ట్రం బాగుపడుతుందని ముచ్చటించుకుంటున్నారు..
మరోవైపు నేడు దర్జాగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న బల్మూర్ వెంకట్ రాజకీయ ప్రయాణాన్ని, ఆర్థిక నేపథ్యాన్ని పరిశీలిస్తే విస్మయం కలిగించే నిజాలు వెలుగులోకి వస్తాయి. ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ఎంబీబీఎస్ చదువుకునే రోజుల్లో చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. కానీ అనతికాలంలోనే ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ నాయకుడిగా ఎదిగి, నేడు ఏకంగా ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్ స్థాయికి చేరుకున్నారు.
రాజకీయాల్లోకి రాకముందు నాటి సామాన్య జీవితానికి, నేడు ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటిస్తున్న కోట్లాది రూపాయల ఆస్తులకు, కూకట్‌పల్లి వంటి హై-ఎండ్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న భారీ స్థిరాస్తులకు పొంతన లేకుండా ఉండటం విస్మయానికి గురిచేస్తుంది. అలాగే సామాన్య నేపథ్యం నుండి వచ్చి, ప్రజా ప్రతినిధిగా మారిన వ్యక్తి ఇలాంటి అక్రమ హోర్డింగ్స్ వ్యాపారాల ద్వారా కోట్ల సామ్రాజ్యాన్ని కూడగట్టుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి.
ప్రశ్నించే గొంతుకనని చెప్పుకునే నాయకులు, స్వయంగా ఇలాంటి అవినీతి వలయాల్లో చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు. అందుకే అడ్వటైజింగ్ పాలసీని అమలు చేయకుండా, అక్రమ బోర్డుల ద్వారా నెలకు లక్షలు దండుకుంటున్న ఈ బాగోతంపై సమగ్ర విచారణ జరగాల్సిందే అనే డిమాండ్ లు ప్రజల నుండి వినిపిస్తున్నాయి.












