తెలంగాణ

మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేవంత్ రెడ్డి టార్గెట్ అదేనా?

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తెలంగాణలో రోజురోజుకు తీవ్రతరమవుతున్న ప్రజా సమస్యలు, కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బందులు, ఉమ్మడి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రజలు, వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ డ్రామాలకు తెరతీశారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

 ప్రజల దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించే కుట్రలో భాగంగానే తాజాగా అత్యంత సున్నితమైన 'ఫోన్ ట్యాపింగ్' కేసును మళ్లీ తెరపైకి తీసుకురావాలని ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన వివాదాస్పద అంశాలను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడటమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పావులు కదుపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులను ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా కొందరి చేత కొత్త ఫిర్యాదులు ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యూహంలో భాగంగానే కొందరి ద్వారా బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఫిర్యాదులు చేయించి, దాని ఆధారంగా కేసును మళ్లీ ముందుకు తీసుకెళ్లి మీడియాలో రాజకీయం చేయాలని చూస్తున్నారనే చర్చ జరుగుతోంది.

 ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి నిత్యం ఏదో ఒక అటెన్షన్ డైవర్షన్ పనులకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న అసలు సమస్యల నుంచి ప్రజల మైండ్ సెట్‌ను డైవర్ట్ చేసేందుకే ఈ తరహా లీగల్ డ్రామాలకు తెరలేపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఇలాంటి డైవర్షన్ రాజకీయాలతో కాలం వెళ్లదీస్తే ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.

#RevanthReddyDiversion#TelanganaPhoneTappingCase#BRSvsCongress#PoliticalDiversionDrama#TelanganaNews2026#RevanthReddyPolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి