తెలంగాణ

LandFraud: ఎమ్మెల్సీకే భూమి పేరుతో భారీ మోసం.. రూ.25లక్షల టోకరా!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన మాదాపూర్ 100ఫీట్ల రోడ్డులో తమది కాని భూమిని తమదేనని నమ్మించి, ఏపీ  కూటమి ప్రభుత్వ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను రూ.25లక్షల మేర బురిడీ కొట్టించిన ఉదంతం కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే ఎమ్మెల్సీ రామచంద్రయ్యను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు పక్కా వ్యూహంతో ఈ రియల్ ఎస్టేట్ మోసానికి తెగబడ్డారు.

 పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. పేరూరి తులసీగోపాల్, అతని కుమారుడు గిరిధర్‌లు మాదాపూర్ 100 ఫీట్ల రోడ్డులోని ప్రైమ్ లొకేషన్‌లో తమకు 5.5ఎకరాల భూమి ఉందని ప్రచారం చేసుకున్నారు. ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టామని ఎమ్మెల్సీని నమ్మించి, బేరం కుదుర్చుకున్నారు. వారి మాటలు నిజమేనని నమ్మిన రామచంద్రయ్య, టోకెన్ అడ్వాన్స్ కింద ఆర్‌టీజీఎస్ (RTGS) ద్వారా రూ.25 లక్షల మొత్తాన్ని వారికి చెల్లించారు.

 అడ్వాన్స్ పొందిన తర్వాత, భూమికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు చూపించాలని ఎమ్మెల్సీ కోరగా.. ఆ తండ్రీకొడుకులు రకరకాల సాకులు చెబుతూ తప్పించుకు తిరగడం ప్రారంభించారు. దీంతో అనుమానం వచ్చిన రామచంద్రయ్య సదరు 5.5ఎకరాల భూమి వివరాలపై ఆరా తీయగా, అసలు ఆ స్థలంతో తులసీగోపాల్, గిరిధర్‌లకు ఎలాంటి సంబంధం లేదని, అది వారి భూమి కాదని స్పష్టమైంది.

 తమను దారుణంగా మోసం చేశారని గ్రహించిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఫిర్యాదు మేరకు బాధితుడి నుంచి రూ. 25లక్షలు కాజేసిన తండ్రీకొడుకులపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

#CRamachandraiah#LandFraudHyderabad#MadhapurLandScam#JubileeHillsPolice#HyderabadRealEstateFraud#AndhraPradeshMLC#CyberabadNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి