National

jantar-mantar-2.0: ఢిల్లీలో సీజేపీ ఆందోళన తీవ్రం.. అభీజీత్ దిప్కే, ధృవ్ రాఠీ అరెస్ట్!

రచన: Mamatha puppala•••4 నిమిషాల పఠనం

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలో తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతిభద్రతల పేరుతో ఢిల్లీ పోలీసులు ముందస్తు అనుమతి నిరాకరించినప్పటికీ, నిరసనకారులు ఆందోళనకు దిగడంతో పోలీసులు ప్రతిఘటించి భారీ ఎత్తున ముందస్తు అరెస్టులు చేపట్టారు.

 కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలో తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతిభద్రతల పేరుతో ఢిల్లీ పోలీసులు ముందస్తు అనుమతి నిరాకరించినప్పటికీ, నిరసనకారులు ఆందోళనకు దిగడంతో పోలీసులు ప్రతిఘటించి భారీ ఎత్తున ముందస్తు అరెస్టులు చేపట్టారు. విమానంలో ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభీజీత్ దిప్కే, కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీలను విమానాశ్రయం, నివాసాల వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 ర్యాలీని అడ్డుకునేందుకు ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 20వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని, ఆర్ఏఎఫ్ (RAF) బలగాలను రంగంలోకి దించారు. రాజధాని పరిధిలోని న్యూఢిల్లీ ప్రాంతాన్ని 20 సున్నితమైన జోన్లుగా విభజించి, పలు క్రీడా స్టేడియంలను తాత్కాలిక డిటెన్షన్ సెంటర్లుగా మార్చారు. దేశరాజధానికి వచ్చే సరిహద్దు ప్రాంతాల్లో ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తూ నిరసనకారులు లోపలికి రాకుండా అడ్డుకున్నారు.

 జంతర్ మంతర్ పరిసరాలకు ప్రదర్శకులు చేరుకోకుండా ఉండేందుకు నగరంలో 45కి పైగా మెట్రో స్టేషన్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆందోళనకారుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా గగనతల నిఘాను నిరంతరం కొనసాగిస్తున్నారు. విపక్ష ఇండియా (INDIA) కూటమి నేతలు, వివిధ విద్యార్థి సంఘాలు, సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈ నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించగా వారందరినీ పోలీసులు బస్సుల్లో ఎక్కించి నిర్బంధ కేంద్రాలకు తరలించారు.

 ఈ అరెస్టులపై స్పందించిన సీజేపీ నేతలు.. ప్రభుత్వం నియంతృత్వ వైఖరితో నిరసన గళాన్ని తొక్కేయాలని చూస్తోందని, ప్రజల రాజ్యాంగ హక్కులను హరిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు రాజధానిలో రవాణా వ్యవస్థల నిలిపివేత ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని, దీనిపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైంది. కేంద్రం, ప్రతిపక్షాల మధ్య ఈ ఆందోళన రాజకీయాన్ని మరింత వేడెక్కించింది.

 

#CJPProtestDelhi#JantarMantar2026#AbhijeetDipkeDetained#CECGyaneshKumar#DelhiPoliceAction#DhruvRatheeDetained#DelhiMassArrests
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి