సినిమా

Krishna Vamsi: నిజంగా రమ్య డేట్స్ చూస్తున్నాడా..మరి సినిమాలు?

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Krishna Vamsi: ఎన్నో కష్టాలు పడి నాలుగైదు రోజుల పాటు తిండి కూడా తినకుండా సినిమా అంటే ఇష్టం, ప్రేమ, పిచ్చితో ఇండస్ట్రీలోనే నిలబడాలని రేయింబవళ్ళు కలలు కన్న దర్శకుల్లో కృష్ణ వంశీ ఒకరు. క్రియేటివ్ డైరెక్టర్‌గా పాపులర్ అయ్యాడు. రాంగోపాల్ వర్మ దగ్గర సహాయకుడిగా చేసి, ఆ తర్వాత దర్శకుడిగా బ్లాక్ బస్టర్స్ తీశాడు. కానీ, గత కొంతకాలంగా ఆయన నుంచి సినిమా రాలేదు. నిజంగా, ఒక దశలో స్వయంగా కృష్ణ వంశీ చెప్పినట్టుగానే భార్య రమ్య కృష్ణ డేట్స్ చూసుకుంటూ ఉండిపోయారా? ఇదే, ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో మాట్లాడుకుంటున్నారు.

గులాబి తో దర్శకుడిగా:

జె. డి. చక్రవర్తి, మహేశ్వరి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ గులాబి సినిమాను తీశాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా చూసిన నాగార్జున కృష్ణ వంశీకి ఛాన్స్ ఇచ్చాడు. అలా, ఇండస్ట్రీ సాధించిన నిన్నే పెళ్ళాడతా సినిమా వచ్చింది. నాగార్జున కెరీర్‌లో ఇది మైల్ స్టోన్ లాంటి సినిమా. తర్వాత రవితేజ, సంఘవి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో సింధూరం తీసి హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత చంద్రలేఖ తో ఫ్లాప్ చూసిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ అంతఃపురం మూవీతో సెన్షేషనల్ హిట్ అందుకున్నాడు. అలా, సముద్రం అనే సినిమా తీశాడు. ఈ సినిమా డిసప్పాయింట్ చేసినప్పటికీ, మహేష్ బాబుతో చేసిన మురారి మాత్రం మళ్ళీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక, ఒకరకంగా మల్టీస్టారర్ అని చెప్పుకోవాల్సిన ఖడ్గం సినిమా సృష్ఠించిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా విడుదల సమయంలో దాదాపు 10 రోజుల పాటు అండర్ గ్రౌండ్‌లో ఉండిపోయాడు.

ఇక, శ్రీఆంజనేయం.. చక్రం..ఫ్లాపవగా, డేంజర్ ఒక మోస్తరు హిట్ గా నిలింది. ఎన్‌టిర్ తో తీసిన రాఖీ అందరితోనూ కన్నీళ్ళు పెట్టించింది. దీని, తర్వాత చందమామ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు కృష్ణ వంశీ. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఆయన్ను బాగా డిసప్పాయింట్ చేశాయి. మళ్ళీ, ఇంతవరకూ కోలుకోలేదు. దీనికి, కారణం టెక్నాలజీ పరంగా కృష్ణ వంశీ అప్‌డేట్ కాలేదనే మాట వినిపించింది. గోవిందుడు అందరివాడేలే సినిమాకి ముందు ఆయన కెరీర్ డైలమాలో పడింది.

ఆ సమయంలో కలిగిన భావన..ఇక నాపైపోయిందా..నెక్స్ట్ ఏంటీ..మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేయాలా? రమ్య కృష్ణ డేట్స్ చూసుకోవాలా? అన్న మీమాంసలో పడ్డారు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో ఛాన్స్ వచ్చినా, ఫలితం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం, ఆయన కథ తయారు చేసుకునే ప్రయత్నాలలో ఉన్నాడట. మరి, ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

#Krishna Vamsi#Tollywood Director#Ramya Krishnan#Cinema News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి