సినిమా

Tollywood: రీషూట్ అంటే సినిమా ఫ్లాపేనా?

రచన: Anshu•••5 నిమిషాల పఠనం

Tollywood: ఎలాంటి టెక్నికల్ సపోర్ట్ లేనప్పుడు కూడా 35 నుంచి 40 రోజుల్లో సినిమాను పూర్తి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి స్టార్ హీరోలు అప్పట్లో మూడు షిఫ్టుల్లో పని చేసి ఏడాదికి అరడజను సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే వారు. దర్శకులు కూడా రాత్రికి రాత్రే కథ రాసేసేవాళ్ళు. దాసరి గారు నైట్ మొత్తం కూర్చొని సీన్స్ రాస్తుంటే, కోడి రామకృష్ణ వాటిని ఫెయిర్ చేసి బౌండెడ్ చేసేవారు.

అలా, కథ, కథనాల కోసం చాలా తక్కువరోజుల్లో రీసెర్చ్ చేసి కూడా సినిమాలు చేశారు. కానీ, ఇప్పుడు ఒక దర్శకుడు కథ రాయాలంటే ఏళ్ళు పడుతోంది. రచయిత కూడా ఇలా, ఏడాది లేదా రెండేళ్ళ సమయమ తీసుకుంటున్నారు. ఇక, మేకింగ్ వచ్చేసరికి ఒక్కో సినిమా కనీసం రెండేళ్ళు పడుతోంది. ముందు, హీరో డేట్స్ లాక్ చేసుకుంటే ఆ తర్వాత కథ వండి వడ్డిస్తున్నారు. అందుకే, పెద్ద హీరోల సినిమాలు కనీసం రెండేళ్ళకి కూడా ఒకటి రావడం లేదు.

అయితే, పాన్ ఇండియా సినిమా అన్న దగ్గరనుంచి చాలా సినిమాలు రీషూట్స్ చేయాల్సి వస్తోంది. ఒక్క రోజు రీషూట్ అంటే మీడియం బడ్జెట్ సినిమాకి కనీసం 10 నుంచి 15 లక్షల ఖర్చు వస్తుంది. అదే భారీ బడ్జెట్ సినిమా అయితే 50 లక్షల వరకూ వేస్ట్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఒకవేళ ఒక సీన్ మొత్తం మళ్ళీ రీ షూట్ అంటే కనీసం 3 రోజులు పట్టొచ్చు కూడా. అంటే ఎంత లేదన్నా కోటిన్నర వృధా గ్యారెంటి. ఈ రకంగా చూస్తే, బాహుబలి, పుష్ప లాంటి సినిమాలకి ఎంత బడ్జెట్ వేస్ట్ అయి ఉండొచ్చు.

అంతేకాదు, ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్‌లో డిలీటెడ్ సీన్స్ అని చూస్తున్నాము. అంటే, ఆ సీన్స్ థియేటర్స్‌లో రిలీజ్ అయినప్పుడు ఉండవు. కానీ, యూట్యూబ్ లో మాత్రం దర్శనమిస్తుంటాయి. షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ అదనంగా తీసి..ఎడిట్ కి వచ్చేసరికి లెంగ్త్ ఎక్కువైందని సీన్ మొత్తాన్ని లేపేస్తుంటారు. ఇక్కడ కూడా నిర్మాతకి చాలా డబ్బు వేస్ట్ అవుతుంది. అసలు వేస్టేజ్ లేకుండా సినిమా తీసే దర్శకుడు రాంగోపాల్ వర్మ అని చెబుతుంటారు. ఎక్కువగా తీసే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్ అని చెప్పుకుంటుంటారు.

ఈ ముగ్గురు దర్శకులు చాలా సీన్స్ ని షూట్ చేస్తారు గానీ, ఫైనల్ గా సినిమా థియేటర్స్‌కి వచ్చేసరికి ఆ సీన్స్ ఉండవు. ఈ రకంగా చూస్తే, బడ్జెట్ కంట్రోల్ లేక సినిమా ఫ్లాప్ గనకైతే నిర్మాత ఎన్నో కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. దీనికి, బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసినప్పుడే..ఒక్క షాట్ కూడా ఎక్కువ తీయడానికి వీల్లేదని నిర్మాత కండీషన్ పెడితే ఈ బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది. లేదంటే, ఆస్తులు అమ్ముకోవడమే కాదు..అప్పుల ఊబిలో నిర్మాత పడాల్సి వస్తుంది.

#Tollywood#SS.Rajamouli#Trivikram#Sukumar#Ramgopal Varma
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి