Tollywood: కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్..ఇవి ఒక్కొక్కటి ఒక్కరు రాస్తుంటారు. అయితే, జనరేషన్ మారుతున్నా కొద్దీ ఈ మూడు రాసుకొని డైరెక్షన్ చేస్తున్న దర్శకులు ఇండస్ట్రీలో ఎక్కువైపోయారు. పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు బయట కథల మీద ఆధారపడింది లేదు. ఒక్క టెంపర్ సినిమా తప్ప. మిగతా సినిమాలన్నిటికీ పూరి కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్. అందుకే, పూరి సినిమాలో హీరోలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు.
అయితే, వి.వి.వినాయక్ లాంటి వారు పూర్తి స్థాయిలో కథ రాసుకోలేరట. అంతేకాదు, ఆయన కథలకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వేరే వాళ్ళు రాయాల్సి వస్తుంది. ఎక్కువగా ఆకుల శివ, పరుచూరి బ్రదర్స్ రాశారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా కథ గానీ, మాటలు గానీ రాయలేరు. కథ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇస్తుంటారు. ఎం రత్నం డైలాగ్స్ రాసిన సినిమాలున్నాయి. ఇప్పుడు వారణాసి కి దేవా కట్టా డైలాగ్స్ రాస్తున్నారు.
కేవలం దర్శకత్వం మాత్రమే చేసే దర్శకులు ఎంతకాలం ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా నిలబడతారో చెప్పడం కష్టం. గత కొంతకాలంగా వినాయక్ కూడా మంచి కథ తయారు చేసుకునే పనిలో ఉన్నాడు. మెగాస్టార్ కోసం కథ అనుకుంటున్నప్పటికీ అది కుదరడం లేదు. అదే, ముందు నుంచి ఆయనే సొంతగా కథ రాసుకుంటే ఇప్పుడు కథ ఇంకోలా ఉండేదేమో. ఈ దర్శకుడి నుంచి ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, ఆది, లక్ష్మీ, బన్నీ, బద్రినాథ్, కృష్ణ, నాయక్ లాంటి బ్లాక్ బస్టర్స్ తీశాడు.
అయితే, అఖిల్ అక్కినేనితో.. అఖిల్ సినిమా చేసి భారీ డిజాస్టర్ తీశాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ వినాయక్ నుంచి సినిమా రాలేదు. ఆయన బర్త్ డే రోజునైనా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, నిరాశ తప్పలేదు. ఇప్పటికే, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథ రాసుకోలేని స్టార్ డైరెక్టర్ త్వరగానే ఫేడవుట్ అయ్యారు. ఇక, కథ మాత్రమే రాయగల రచయితలు ఆ తర్వాత దర్శకులుగా కూడా సత్తా చాటారు.










