ఏపీ

AP : అమెరికాలో తెలుగు యువకుడికి 50 నెలల జైలు శిక్ష!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

విదేశాల్లో సాటి భారతీయుల పట్ల మనోళ్లు కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారు. పని నిమిత్తం ఇండియా నుంచి విదేశాలకు రప్పించుకోని వారికి సరిగా తిండిపెట్టకుండా, వేతనం చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

విదేశాల్లో సాటి భారతీయుల పట్ల మనోళ్లు కర్కశత్వంగా వ్యవహరిస్తున్నారు. పని నిమిత్తం ఇండియా నుంచి విదేశాలకు రప్పించుకోని వారికి సరిగా తిండిపెట్టకుండా, వేతనం చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు అక్రమ రవాణాలకు సైతం పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఏజెంట్ల రూపంలో కొందరు విదేశాలకు తీసుకెళ్లి అక్కడ స్మగ్లింగ్, సైబర్ నేరగాళ్లకు అప్పజెప్పి క్యాష్ చేసుకుంటున్నట్టు సమాచారం.

ఇటీవలి కాలంలో తెలంగాణ నుంచి కొందరు బతుకుదెరువు కోసం రష్యా వెళ్లగా ఏజెంట్లు వారి మోసం చేసినట్టు తెలిసింది. అక్కడకు వెళ్లిన వారిని బలవంతంగా రష్య సైన్యంలో చేర్చి ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడానికి పంపిస్తున్నట్టు నెట్టింట వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాధిత కుటుంబీకులు సైతం మీడియా ముందు కన్నీటిపర్యంతమైన ఘటనలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఏపీకి చెందిన సత్తారు వెంకటేశ్ అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అక్కడ తనకు సాయం కోసం స్వరాష్ట్రానికి చెందిన మరో వ్యక్తిని పిలిపించుకుని టార్చర్ చేసిన కేసులో నిందితుడిగా తేలాడు. దీంతో అమెరికా ఫెడరల్ కోర్టు వెంకటేశ్ రెడ్డికి 50 నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకివెళితే.. ఏపీలో వైసీపీ పార్టీకి సానుభూతి పరుడిగా ఉన్న సత్తారు వెంకటేశ్.. మిస్సోరిలోని సెయింట్ చార్లెస్ కౌంటీలో నివాసం ఉంటున్నాడు. అక్కడ పని ఉందని మరో వ్యక్తిని ఏపీ నుంచి రప్పించుకున్నాడు.

అక్కడ సదరు వ్యక్తి సరిగ్గా పని చేయలేదనే నెపంతో విద్యుత్ తీగలు, పీవీసీ పైపులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతేకాకుండా అతను బయట ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇతరులతోనూ తీవ్రంగా దాడి చేయించినట్టు అభియోగాలు ఉన్నాయి. నెలల తరబడి సాగిన ఈ పాశవిక వేధింపులతో ఆ యువకుడు కనీసం తిండి, నిద్రలేక ఏకంగా 30 పౌండ్లకు పైగా బరువు కోల్పోయాడు. శరీరంలో ఎముకలు విరిగి నడవలేని స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో అమెరికన్ పోలీసులు మెరుపు దాడి చేసి బాధితుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో మానవ అక్రమ రవాణా , బలవంతపు కార్మికుల చట్టాల ఉల్లంఘన, తీవ్ర భౌతికదాడుల అభియోగాలతో పాటు ఫెడరల్ ప్రభుత్వ నిధులను అక్రమంగా కాజేసిన ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ అరాచకానికి పాల్పడిన వెంకటేష్ రెడ్డికి 50 నెలల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించింది.

#America fedaral court#50 months#jail conviction#telugu person#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి