Spirituality

ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ దర్శనం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

విజయవాడలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజూ ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

 విజయవాడలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజూ ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో తొలిరోజైన నేడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దివ్యమంగళ రూపంలో అభయమిస్తున్నారు.

 అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు. మొదటి రోజు అలంకారమైన బాలాత్రిపుర సుందరి దేవిని దర్శించుకోవడం ద్వారా సమస్త విద్యలు, సంపదలు సిద్ధిస్తాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పది రోజుల పాటు అమ్మవారి వివిధ రూపాల దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.

 ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొలి రోజున అమ్మవారు జ్ఞాన సరస్వతీ దేవి (మూల రూపం)గా భక్తులకు అభయమిస్తున్నారు.

ఈ పది రోజుల పాటు అమ్మవారిని దర్శించడం వల్ల సకల విద్యాబుద్ధులు, జ్ఞానసంపద సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

#IndrakeeladriDasara2026#KanakaDurgaTemple#BalaTripuraSundari#VijayawadaDevotional#DasaraNavaratrulu#APFestivals#GoddessDurga
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి