తెలంగాణ

హైదరాబాద్‌లో డ్రైవర్ లేకుండానే ట్యాక్సీలు.. సీఎం చేతిలో నివేదిక!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు, ప్రయాణికులకు మెరుగైన ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు కిందికి రాకుండానే, నేరుగా స్టేషన్ నుంచే గమ్యస్థానానికి చేరుకునేలా డ్రైవర్‌రెస్ పాడ్ ట్యాక్సీల (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్-PRTS) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

 ఐటీ కారిడార్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో మొత్తం 40.82 కిలోమీటర్ల మేర ఈ అధునాతన నెట్‌వర్క్‌ను నిర్మించాలని ప్రతిపాదిస్తూ ‘లీ అసోసియేట్స్’ సంస్థ రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదికను హెచ్‌ఎంఆర్‌ఎల్ (HMRL) అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా నాలుగు కారిడార్లను ప్రతిపాదించారు.

 కూకట్‌పల్లి - రాయదుర్గం (7.62 కి.మీ), రాయదుర్గం-నాలెడ్జ్ సిటీ (12.83 కి.మీ), రాయదుర్గం/హైటెక్ సిటీ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (14.01 కి.మీ.), అలాగే సచివాలయం - ఎన్టీఆర్ మార్గ్ (6.36 కి.మీ.) మార్గాల్లో ఈ ట్యాక్సీలను నడపాలని ప్రణాళిక రూపొందించారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 2030 నాటికి రోజుకు 5.42లక్షల మంది, 2050నాటికి దాదాపు 20.31లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని నివేదిక అంచనా వేసింది.

 ఈ ప్రతిపాదనలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. నగరంలో రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ వ్యవస్థను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాడ్ ట్యాక్సీలను మెట్రో, ఎంఎంటీఎస్ (MMTS), బస్ స్టేషన్లతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఉత్తమ పీఆర్‌టీఎస్ విధానాలను అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. 3 నుంచి 6 మంది కూర్చునే సామర్థ్యం గల ఈ డ్రైవర్‌లెస్ పాడ్‌లు ఎలివేటెడ్ ట్రాక్‌లపై రాకపోకలు సాగిస్తూ నగర ప్రయాణ రూపురేఖలను పూర్తిగా మార్చనున్నాయి.

#HyderabadPodTaxis#HMRL#RevanthReddy#ITCorridorHyderabad#LastMileConnectivity#PRTSTransport#TelanganaNews2026
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి