సినిమా

Mythri Movie Makers: రణబాలికి ఇరుముడి స్ట్రాటజీ..!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Mythri Movie Makers: ఇటీవల వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఈ సినిమా సాలీడ్ కంబ్యాక్ ఇచ్చింది. మైత్రీ వారు ఊహించని లాభాలను అందుకున్నారు. ఇరుముడి సినిమాకి వచ్చిన లాభాలలో మీడియం బడ్జెట్ సినిమాలు కనీసం 5 తీయోచ్చు. అంతగా, ఈ మూవీ నిర్మాణ సంస్థను పైకి తీసుకువచ్చింది.

Mythri Movie Makers: ఇటీవల వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఈ సినిమా సాలీడ్ కంబ్యాక్ ఇచ్చింది. మైత్రీ వారు ఊహించని లాభాలను అందుకున్నారు. ఇరుముడి సినిమాకి వచ్చిన లాభాలలో మీడియం బడ్జెట్ సినిమాలు కనీసం 5 తీయోచ్చు. అంతగా, ఈ మూవీ నిర్మాణ సంస్థను పైకి తీసుకువచ్చింది.

దీనికి, ప్రధాన కారణం ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండా రిలీజ్ చేయడమే. సినిమా ఎప్పుడైతే కామన్ ఆడియన్‌కి అందుబాటులో ఉంటుందో..అప్పుడు గ్యారెంటీగా సక్సెస్ సాధిస్తుంది. కథ బలంగా ఉంటే ఇప్పుడు కూడా థియేట్రికల్ రిలీజ్ లో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్స్ అందుకోవచ్చు అని ఇరుముడి సినిమా మళ్ళీ నిరూపించింది. మల్టీప్లెక్స్, సింగిన్ స్క్రీన్స్..ఎక్కడైనా ఒకే ప్రైస్ తో వచ్చిన ఇరుముడి..250 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే, ఈ కథ ఎమోషనల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంతగా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

రణబాలి కూడా ఇరుముడి రూట్‌లోనే:

విజయ్ దేవర కొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్రీరియాడిక్ సినిమా రణబాలి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2 ఒక రకంగా రణబాలి చిత్రానికి పోటీ అని చెప్పాలి. పెద్దగా ఈ సినిమా ప్రభావం ఉండకపోయినా, కూడా జైలర్ 2 బ్లాక్ బస్టర్ అని టాక్ వస్తే కాస్తో కూస్తో కలెక్షన్స్ మీద ప్రభావం పడుతుంది.

ఇది, ముందే గమనించారా..లేక, విజయ్ కి దాదాపు ఏడేళ్ళుగా హిట్స్ లేదని భావించారా..లేక ఇరుముడి సినిమాను ఆదర్శంగా తీసుకున్నారా అనేది తెలియదు గానీ, విజయ్ ఇటీవల ప్రమోషన్స్‌లో ఇకపై తన సినిమాలకి ఎలాంటి హైక్స్ ఉండవని తేల్చి చెప్పాడు. ఇప్పుడు, రాబోతున్న రణబాలి సినిమాకి టికెట్ హైక్ లేకుండా చూడమని ఫ్యాన్స్‌కి ప్రేక్షకులకు చెప్పాడు. నిజంగా, ఇది మంచి పరిణామం.

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పెరగాలంటే, పాన్ ఇండియా సినిమా కూడా సాధారణ ధరలకి సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేలా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే గ్యారెంటీగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయి. మరి, ఇరుముడి స్ట్రాటజీతో రాబోతున్న రణబాలి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

#Ranabaali#Vijay Devarakonda#Rashmika Mandanna#Irumudi#Tikect Hikes
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి