International

ఉక్రెయిన్ నాయకత్వం మారాల్సిందే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. రష్యాలోని కీలక ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులు చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో డీజిల్ ధరకు విపరీతమైన కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. రష్యాలోని కీలక ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులు చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో డీజిల్ ధరకు విపరీతమైన కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు తమ కోసం రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోగల కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ కొరతను తగ్గించేందుకు రష్యాపై ఉన్న కొన్ని రకాల ఇంధన ఆంక్షలను సడలించి, రష్యా నుంచి డీజిల్ దిగుమతి చేసుకునేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జెలెన్స్కీ.. అమెరికా చర్య రష్యా సైనిక చర్యకు, పుతిన్ యుద్ధ యంత్రానికి పెట్టుబడిగా మారుతుందని మండిపడ్డారు. తమ దేశంలో పవర్ ప్లాంట్లపై రష్యా రాకెట్ దాడులు నిలిపివేస్తేనే తాము రిఫైనరీలపై దాడులు ఆపుతామని స్పష్టం చేయడంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు.

 ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఇంధన స్థావరాలపై దాడులు చేయవద్దని జెలెన్స్కీకి స్పష్టంగా చెప్పాం. కానీ ఆయన దాన్ని పట్టించుకోకుండా ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకున్నారు’ అని ఆరోపించారు. దౌత్యపరంగా శాంతి చర్చల ద్వారా రష్యాతో ఒప్పందం చేసుకోకుండా జెలెన్స్కీ పట్టుదలకు పోవడం వల్ల ఉక్రెయిన్ దేశం భారీగా భూభాగాన్ని, వేలాది మంది సైనికులను కోల్పోయిందని వ్యాఖ్యానించారు.

 మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజల మద్దతుతో ప్రాతినిధ్యం వహిస్తున్నారని, రష్యా ఆదాయ మార్గాలను దెబ్బతీయడం ఉక్రెయిన్ ఆత్మరక్షణలో భాగమని స్పష్టం చేసింది. మరోవైపు రష్యాతో ట్రంప్ చేసుకున్న డీజిల్ డీల్‌పై యూఎస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.

 

#TrumpVsZelenskyy#UkraineRussiaWar2026#USForeignPolicy#DieselPrices#DonaldTrump#VolodymyrZelenskyy#GlobalEnergyCrisis
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి