క్రీడలు

VirenderSehwag: వైభవ్ ఆలోచనా విధానం నాలాగే ఉంది: సెహ్వాగ్

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

క్రికెట్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ ప్రారంభంలో తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే వైభవ్ బ్యాటింగ్ శైలి, ఆలోచనా విధానం సరిగ్గా తనను పోలి ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 క్రికెట్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ ప్రారంభంలో తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే వైభవ్ బ్యాటింగ్ శైలి, ఆలోచనా విధానం సరిగ్గా తనను పోలి ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన 'పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ' వార్షిక సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్.. యువ క్రికెటర్ సూర్యవంశీ ప్రతిభపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

 సెహ్వాగ్ మాట్లాడుతూ.. క్రీజులోకి వచ్చిన వెంటనే ఎలాంటి భయం లేకుండా దూకుడుగా ఆడాలనే సూర్యవంశీ మైండ్ సెట్ తనకు ఎంతో నచ్చిందన్నారు. భారత సీనియర్ జట్టులో లేదా ఐపీఎల్ వంటి వేదికల్లో ఆడేటప్పుడు ఆటగాడి వయసు కంటే కూడా అతడి ప్రతిభ, ప్రస్తుత ఫామ్ మాత్రమే ప్రమాణంగా ఉండాలని స్పష్టం చేశారు.

 సీనియర్ జట్టుకు వయసుతో సంబంధం లేదు

‘అండర్-19 వంటి వయోపరిమితి టోర్నీల్లో కచ్చితంగా నిబంధనలు పాటించాలి. కానీ సీనియర్ జట్టుకు ఎంపిక చేసేటప్పుడు వయసుతో సంబంధం లేదు. 38 ఏళ్ల విరాట్ కోహ్లీ అయినా, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అయినా మైదానంలో వాళ్ల ప్రదర్శనే ముఖ్యం’ అని సెహ్వాగ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున ఆడేందుకు సూర్యవంశీకి మరింత మంది సీనియర్ల ప్రోత్సాహంతో పాటు వరుస అవకాశాలు దక్కాలని సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 క్రికెట్ ఆడుతున్న సమయంలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మైదానంలో నిలకడగా రాణించాలన్నారు. అదే సమయంలో ఇతర విషయాలను పక్కనపెట్టి ఆటపైనే దృష్టి సారించాలని సూచించారు. సూర్యవంశీకి టీమిండియాలో మెరుగైన భవిష్యత్తు ఉందంటూ దిగ్గజ బ్యాటర్ ప్రశంసించారు. సెహ్వాగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

#VirenderSehwag#VaibhavSooryavanshi#TeamIndia#IndianCricket#YoungTalent#AggressiveBatting#CricketNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి