తెలంగాణ

గజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు.. రైతును అవహేళన చేయడంపై కలెక్టర్ సీరియస్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకున్నాయి. భూ సమస్యతో కార్యాలయానికి వచ్చిన రైతును చూసి ‘నువ్వింకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?’ అంటూ అవహేళన చేసిన తహసీల్దార్ చిట్టంపల్లి స్వామి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకున్నాయి. భూ సమస్యతో కార్యాలయానికి వచ్చిన రైతును చూసి ‘నువ్వింకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?’ అంటూ అవహేళన చేసిన తహసీల్దార్ చిట్టంపల్లి స్వామి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) సమర్పించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.

గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు ఏసు తన భూ వివాదంపై తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, అక్కడి అధికారి స్వామి అత్యంత అహంకారపూరితంగా మాట్లాడిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నా పరిస్థితి చూసి నవ్వు వస్తోందా?’ అని రైతు ఆవేదనగా ప్రశ్నిస్తే, ‘అవును వస్తది.. బరాబర్‌ వస్తది’ అంటూ ఎమ్మార్వో నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు నేతలు ఈ అమానవీయ ఘటనపై మండిపడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఆర్డీఓ జరిపిన విచారణలో తహసీల్దార్ స్వామి విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనా నియమావళిని (Conduct Rules) పూర్తిగా ఉల్లంఘించినట్లు స్పష్టమైంది. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా కలెక్టర్ తహసీల్దార్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా, ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని కఠిన ఆంక్షలు విధించారు.

ఇదిలా ఉండగా బాధిత రైతు స్వయంగా తహసీల్దార్‌ తన భూ సమస్యను పరిష్కరించి మేలే చేశాడని అసలు నిజాన్ని చెప్పాడు. అయితే, అయినప్పటికీ అధికారిక హోదాలో ఉన్న వ్యక్తి పౌరులతో మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు దారితీయడంతో ఈ చర్య తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేతల ఆరోపణలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోంది.

#GajwelTahsildarSuspended#ChittampallySwami#SiddipetCollector#RythuVadapalli#TelanganaReforms#GovernmentAction#BureaucracyTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి