క్రైమ్

సస్పెండ్ అయిన వారే టార్గెట్.. హడలెత్తిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఏసీబీ (Anti-Corruption Bureau) పేరును అడ్డుపెట్టుకుని కొందరు కేటుగాళ్లు భారీ వసూళ్ల దందాకు తెరలేపారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారులంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి, అవినీతి కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

 అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఏసీబీ (Anti-Corruption Bureau) పేరును అడ్డుపెట్టుకుని కొందరు కేటుగాళ్లు భారీ వసూళ్ల దందాకు తెరలేపారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారులంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి, అవినీతి కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అందులోనూ ప్రత్యేకించి సస్పెండైన ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

 తాజాగా ఎస్సీ కులాల అభివృద్ధి శాఖకు చెందిన ముగ్గురు సస్పెండెడ్ ఉద్యోగులను నకిలీ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. తాము ఏసీబీ అధికారులమని ఫోన్ చేసి, మీపై తీవ్రమైన ఫిర్యాదులు వచ్చాయని, విచారణ నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించి వారి నుంచి రూ.లక్ష ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకున్నారు. డబ్బులు అందిన తర్వాత వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులు మోసపోయామని గుర్తించారు.

 ఇదే రీతిలో ఉద్యానవన శాఖ అధికారిని బెదిరించి ఏకంగా రూ.1.9లక్షలు వసూలు చేసిన ఘటనపై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. నల్లగొండలో ఉద్యానవన శాఖ అధికారి ఏసీబీకి చిక్కిన ఉదంతాన్ని ఆసరాగా చేసుకుని, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల అధికారులను ఈ కేటుగాళ్లు భయభ్రాంతులకు గురిచేశారు. ప్రధానంగా ఫిషరీస్, వైద్య ఆరోగ్య, వ్యవసాయం, ఉద్యానవనం సహా సుమారు 10 ప్రభుత్వ శాఖల అధికారులను ఈ ముఠా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

 ఈ వరుస మోసాలపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తీవ్రంగా స్పందించారు. ఎవరైనా ఏసీబీ లేదా ఇతర దర్యాప్తు సంస్థల అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు. ఇలాంటి నకిలీ కేటుగాళ్ల భరతం పడతామని, పీడీ యాక్ట్ (PD Act) వంటి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

#SuryapetFakeACB#FakeACBCallScam#SrigiriNarsimhaSP#GovernmentEmployeesTarget#TelanganaCrimeNews#ACBTheftCase#SuryapetPolice
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి