సినిమా

RT 78-Thulabharam: కొత్త జానర్‌లో రవితేజ 'తులాబారం' మొదలు..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

RT 78-Thulabharam: టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో ఈ మాస్ రాజాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న రవితేజ.. ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ.

RT 78-Thulabharam: టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో ఈ మాస్ రాజాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న రవితేజ.. ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ. వీరిద్దరు కలిసి ఇప్పుడు 'తులాబారం' అనే సినిమాతో రాబోతున్నారు.

తాజాగా ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. తులాబారం సినిమాను ఊహించని కాంబినేషన్‌తో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. రవితేజ సినిమాలు అంటేనే ప్రేక్షకులకు గుర్తొచ్చేది మాస్ అండ్ యాక్షన్, కామెడీ, అదిరిపోయే డైలాగ్స్. ఇక, వివేక్ ఆత్రేయ ఇప్పటి వరకూ తీసిన తన సినిమాల్లో విభిన్నమైన కథనం, సహజమైన భావోద్వేగాలు, ప్రత్యేకమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది.

డెడ్లీ కాంబినేషన్:

రవితేజ సినిమాలో ఇప్పటి వరకూ కనిపించని కాంబినేషన్స్ ఇప్పుడు 'తులాబారం' మూవీలో కనిపించబోతున్నాయి. దుబాయ్ శీను సినిమా తర్వాత జేడీ చక్రవర్తి మళ్ళీ రవితేజతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. హీరోయిన్స్‌గా ప్రియాంక అరుళ్ మోహన్, అనస్వర రాజన్ నటిస్తున్నారు. రవితేజతో వీరిది ఫ్రెష్ కాంబినేషన్. దర్శక, నటుడు తరుణ్ భాస్కర్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఇటీవల వచ్చిన ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఇప్పుడు, క్రైమ్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇలాంటి, జానర్ లో ఇప్పటి వరకూ రవితేజ సినిమా చేయలేదు. వివేక్ ఆత్రేయ తీసిన ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’, ‘సరిపోదా శనివారం’ సినిమాలకి పూర్తి భిన్నంగా ఈ మూవీ ఉంటుందని మాత్రం టైటిల్ కార్డ్‌లో వేసిన పేరును చూస్తే అర్థమవుతోంది. మరి, ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.

#RT 78 Thulabharam#Raviteja#Priyanka Arul Mohan#Anaswara Rajan#Vivek athreya#JD Chakravarthy#Tarun Bhaskar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి