సినిమా

Samantha: మోడల్‌ టు హీరోయిన్..'సమంత' ఒంటరి పోరాటం

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Samantha: అందరూ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాళ్ళే స్టార్స్‌గా ఎదుగుతారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత. 500 రూపాయల కోసం వెల్కం గర్ల్‌గా ఎంట్రన్స్ లో నిలుచున్న సమంత, ఇప్పుడు పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్, స్టార్ హీరోయిన్, నిర్మాత, బిజినెస్ ఉమెన్. సమంత జీవితాన్ని గనక ఆదర్శంగా తీసుకుంటే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో నిలబడతారు.

Samantha: అందరూ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాళ్ళే స్టార్స్‌గా ఎదుగుతారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత. 500 రూపాయల కోసం వెల్కం గర్ల్‌గా ఎంట్రన్స్ లో నిలుచున్న సమంత, ఇప్పుడు పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్, స్టార్ హీరోయిన్, నిర్మాత, బిజినెస్ ఉమెన్. సమంత జీవితాన్ని గనక ఆదర్శంగా తీసుకుంటే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో నిలబడతారు.

గీతా కృష్ణ యాడ్ ఫిలిం లో ఫస్ట్ ఛాన్స్:

ఒకప్పటి దర్శకుడు గీతా కృష్ణ చాలా యాడ్ ఫిలింస్ డైరెక్ట్ చేశాడు. ఒక యాడ్ కోసం అప్పటికే హీరోయిన్‌గా పాపులర్ అయిన శోభన కోసం వెయిట్ చేస్తున్న సమయం. ఆమె వేరే షూటింగ్ ముగించుకొని విదేశాల నుంచి ఆరోజే చెన్నైలో దిగింది. కానీ, గీతా కృష్ణ వెంటనే షూట్ మొదలుపెట్టాలి. శోభన బాగా అలిసిపోయి 2 రోజులు సమయం అడిగింది. అంత సమయం దర్శకుడి దగ్గర లేక ఫైనల్‌గా ఆ ఛాన్స్ సమంతకి చేరింది. అలా, మొదటి యాడ్ ఫిలింలో ఛాన్స్ అందుకుంది. మొదటి రెమ్యునరేసహన్‌గా 5 వేలు అందుకుంది.

ఆ తర్వాత దర్శకుడు గౌతం వాసుదేవ్ మీనన్ రూపొందించిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఏ మాయ చేశావేలో హీరోయిన్‌గా ఛాన్స్ అందుకుంది. అక్కినేని నాగ చైతన్యకి జంటగా నటించిన సమంత ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. బ్యాక్ టు బ్యాక్ ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌లో స్టార్స్ తో నటించే అవకాశాలు అందుకుంది. సమంత లక్ కలిసి వచ్చి మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌లను అందుకున్నాయి. కోట్లలోకి రెమ్యునరేషన్ వెళ్ళిపోయింది.

కెరీర్ ఇంత పీక్స్‌లో ఉన్నప్పుడే నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి విడాకులు..అంతా ఓ కలలా జరిగిపోయింది. సాధారణంగా ఇలాంటి ప్రళయం ఎదురైనప్పుడు తట్టుకొని నిలబడటం చాలా కష్టం. కానీ, సమంత విడాకుల తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుందో చాలామందికి తెలుసు. దీనికి, తోడు మయోసైటిస్ వ్యాది బారిన పడి పోరాడి నిలబడింది. జీవితంలో ఇంతకన్నా క్లిష్ట పరిస్థితులు ఎదురవవేమో. ఆ దెబ్బతో సినిమాలకి కాస్త దూరం అయింది.

మానసికంగా, శారీరకంగా కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అదే సమయంలో దర్శక, నిర్మాత రాజ్ నిడిమోరుతో ప్రేమ పెళ్లి..మళ్ళీ అన్నీ కలిసి వచ్చినట్టుగా సాగింది సమంత ప్రయాణం. ఇటీవల మా ఇంటి బంగారం సినిమాతో వచ్చి 100 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఇది, ఎవరూ ఊహించనిది. నిర్మాతగా, వ్యాపారవేత్తగా విజయం సాధించింది. ప్రస్తుతం సమంత గర్భవతి. త్వరలోనే ఆమె గుడ్ న్యూస్ చెప్పబోతోంది. తనకు పుట్టబోయో బిడ్డ కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తోంది సమంత.

#Samantha#Actres Samantha#South Actress Samantha#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి