ఏపీ

AP : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రూట్ క్లియర్ అయ్యింది. రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 105కు సవరణలు చేసి కొత్తగా జీవో నెంబర్ 153ను జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రూట్ క్లియర్ అయ్యింది. రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 105కు సవరణలు చేసి కొత్తగా జీవో నెంబర్ 153ను జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.దీంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది..

ఇదిలాఉండగా, ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి సర్కార్ సిద్ధపడగా..ఇది రాజ్యంగం స్ఫూర్తికి విరద్ధమంటూ కొందరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పుచెప్పింది. దాంతో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును సమర్ధించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది.

రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసమే అని స్పష్టంచేసింది. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఏపీ సర్కార్ సవరించిన జీవో 153ని జారీ చేసింది. ఎన్నికలు ఏవైనా ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని కోర్టులు స్పష్టం చేయడంతో కూటమి సర్కార్ దిగి రాక తప్పలేదు.

దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేందుకు సిద్ధమైంది. గ్రామీణ స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు చట్ట నిబంధనల ప్రకారం నిర్ణయించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సీట్లు, పదవుల కేటాయింపు, రిజర్వేషన్ల రొటేషన్‌పై ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించిందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. జీవో 153 అమలుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

#BC reservations#local body elections#new GO release#Ap government#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి