National

Rahul Gandhi: ఢిల్లీలో రాహుల్ వన్ మ్యాన్ షో? మిత్రపక్షాలకు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ డ్రామానా!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనల వెనుక సరికొత్త రాజకీయ చక్రవ్యూహం దాగుందా? ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై నిరసనల పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న రచ్చ ఇప్పుడు సొంత ‘ఇండియా’ కూటమిలోనే తీవ్ర అనుమానాలకు ఆజ్యం పోస్తోంది.

Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనల వెనుక సరికొత్త రాజకీయ చక్రవ్యూహం దాగుందా? ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై నిరసనల పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న రచ్చ ఇప్పుడు సొంత ‘ఇండియా’ కూటమిలోనే తీవ్ర అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో జరుగుతున్న ఈ ఆందోళనలన్నీ కేవలం 'గాంధీ కుటుంబం పబ్లిసిటీ స్టంట్' మాత్రమేనని, విపక్షాల్లోని ఇతర ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని దెబ్బకొట్టేందుకే కాంగ్రెస్ ఈ మైలేజ్ డ్రామాకు తెరలేపిందన్న చర్చ హస్తిన వర్గాల్లో జోరుగా సాగుతోంది.

కెమెరాలన్నీ తమవైపే..

గత కొద్ది రోజులుగా ఢిల్లీ రోడ్లపై సాగుతున్న ధర్నాల్లో మరే ఇతర విపక్ష నేతకూ కనీస ప్రాధాన్యం దక్కడం లేదు. టీవీ కెమెరాలు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా లైవ్‌లు.. ఇలా సమస్త ప్రచార వేదికలను రాహుల్, ప్రియాంక మాత్రమే హైజాక్ చేసేశారన్న ఆగ్రహం మిత్రపక్షాల్లో కనిపిస్తుంది. "కూటమి ఉమ్మడి పోరాటం అని చెప్పి, ఆఖరికి అంతా రాహుల్ గాంధీ వన్ మ్యాన్ షోగా మార్చేశారు. మైలేజ్ మొత్తం వాళ్లే కొట్టేస్తూ, ప్రాంతీయ పార్టీలను డమ్మీలుగా చిత్రీకరిస్తున్నారు" అని ఇండియా కూటమిలోని పలు కీలక పార్టీల నేతలు తెరవెనుక భగ్గుమంటున్నారు. శివసేన (యుబిటి) పత్రిక ‘సామ్నా’ సైతం ఆప్, డీఎంకేలను కలసి రావాలని సంపాదకీయం రాసిందంటే.. కూటమి ఐక్యత ఏ స్థాయిలో బీటలు వారిందో స్పష్టమవుతోంది.

ఉద్యమ పార్టీకి చెక్.. మోడీతో కుమ్మక్కయ్యారా?

ఢిల్లీ వీధుల్లో పుట్టి దేశవ్యాప్త ప్రభంజనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ నిరసనల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. సిజెపి (కాక్రోచ్ జనతా పార్టీ) లేవనెత్తిన ప్రజా ఉద్యమాన్ని పక్కదారి పట్టించి, రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేసేందుకే మోడీ సర్కార్ ఈ ధర్నాకు లైన్ క్లియర్ చేసిందని ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆప్.. ఇక్కడ రాహుల్ షోలో జూనియర్ ఆర్టిస్ట్‌లా మారి క్రెడిట్ ఇవ్వడానికి ససేమిరా అంటోందట. మరోవైపు తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకేతో కాంగ్రెస్ అంటకాగుతోందంటూ డీఎంకే రగిలిపోతుండటం విపక్షాల పరస్పర అపనమ్మకాన్ని బట్టబయలు చేస్తోంది.

ప్రజల సమస్యల కంటే తమ నేత ఇమేజ్ పెంచుకోవడమే పరమావధిగా కాంగ్రెస్ చేస్తున్న ఈ 'సోలో ఫైట్'.. అంతిమంగా విపక్షాల ఐక్యతను నిలువునా చీల్చేసి, బీజేపీకి అయాచిత వరంగా మారుతోందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Rahul Gandhi#Priyanka Gandhi#Congress Party#Indian National Congress#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి