సినిమా

Vijay Devarakonda: శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ..?

రచన: Anshu4 నిమిషాల పఠనం

Vijay Devarakonda: శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఫ్యామిలీ చిత్రాలతో..అర్జున్ రెడ్డి లాంటి వైలెంట్ మూవీస్ తో రౌడీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అలాంటి, ఇమేజ్ ఉన్న ఈ హీరో పౌరాణిక సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Vijay Devarakonda: శ్రీకృష్ణుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఫ్యామిలీ చిత్రాలతో..అర్జున్ రెడ్డి లాంటి వైలెంట్ మూవీస్ తో రౌడీ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అలాంటి, ఇమేజ్ ఉన్న ఈ హీరో పౌరాణిక సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రలో నటించబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దిల్ రాజు నిర్మాణంలో:

ఇటీవల గుజరాతీలో వచ్చిన "లాలో – కృష్ణ సదా సహాయతే" చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. భక్తిరస చిత్రంగా వచ్చిన ఈ సినిమా అక్కడ కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు మొదలు పెట్టాడట. గుజరాతీలో ఈ సినిమా రిలీజైన మొదటి వారం కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ తర్వాత, మౌత్ టాక్‌తోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది గుజరాతీ సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్.

కథాంశమే ఈ సక్సెస్ కి కారణం:

ఏ భాషలో అయినా వినూత్నమైన కథలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. బాగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఒక ఆటో డ్రైవర్ జీవితంలో శ్రీకృష్ణుడు ప్రవేశించి.. అతన్ని సరైన మార్గంలో ఎలా నడిపించాడు..అనేది ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఇది, ప్రతీ కామన్ ఆడియన్‌కి బాగా కనెక్ట్ అయింది. కాబట్టే, అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో, దిల్ రాజు ఈ సినిమా తెలుగు రైట్స్‌ని దక్కించుకున్నాడు.

"గోపాల గోపాల" లో పవన్ కళ్యాణ్:

సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మించిన "గోపాల గోపాల" సినిమాలో వెంకటేష్-పవన్ కళ్యాణ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడి పాత్రలో నటించాడు. వెంకీ ఓ మధ్య తరగతి వ్యక్తిగా నటించాడు. ఈ సినిమా హిందీలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్. అలా, అప్పట్లో పవన్ కళ్యాణ్, ఇప్పుడు విజయ్ దేవరకొండ శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం అందుకున్నారు. కాకపోతే, విజయ్ సినిమా నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం విజయ్ రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలలో నటిస్తున్నాడు.

#Dil Raju#Vijay Devarakonda#Pawan Kalyan#Laalo – Krishna Sada Sahaayate
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి