తెలంగాణ

Telangana: రైజింగ్ స్టేట్‌లో రసవత్తరంగా కాంగ్రెస్ రాజకీయం!..

రచన: Venu9 నిమిషాల పఠనం

ప్రజల కోసం పని చేయాలంటే ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, తోటి మంత్రిని తొలగించేందుకు రేవంత్ రెడ్డి నానాయాతన పడుతున్నారు. గతంలో కేసీఆర్ బలమైన బీసీ లీడర్ అయిన ఈటల రాజేందర్‌ను చిటికలో తీసివేశారు. కబ్జాకోరు అంటూ ముద్ర వేశారు.

తోటి మంత్రిపై రేవంత్ మార్క్ ఫిర్యాదు?

శాఖలు మార్చాల్సిందే అంటూ రిపోర్ట్?

క్రాస్ చెక్ చేసుకున్న ఢిల్లీ పెద్దలు?

- అవకాశం ఇచ్చినా వినియోగించుకోవడం లేదని కొండాపై సీఎం నివేదిక?

- హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే నాగార్జున కుటుంబంపై కేటీఆర్ కుట్ర అంటూ మురికి మాట?

- ఆనాడే ఎన్ని విమర్శలు వచ్చినా వదిలేశా

- రెండు ప్రధాన బలమైన బీసీ కులాల్లో వారికి పట్టు లేదు?

- వద్దని సస్పెండ్ చేసినా మాజీ ఓఎస్డీ సుమంత్‌ను పెంచి పోషించారు?

- నోరు అదుపులో లేదు.. ప్రతిభ కనబర్చడం లేదంటూ న్యూస్ క్లిప్పింగ్స్ అందజేత?

- ఓ పాత ఆడియో కన్వర్షన్ రిపోర్ట్‌ను సైతం ఇచ్చిన సీఎం?

- రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపిన హైకమాండ్?

- రాజీనామా.. కుదరదంటే తొలగింపు.. అసెంబ్లీ వరకు వేచి చూడాల్సిందే?

- రైజింగ్ స్టేట్‌లో సొంతింటి కయ్యాలతో ఆగమాగవుతున్న కాంగ్రెస్ పార్టీ తీరుపై పార్ట్ -4

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

దిక్చూచి లేని కాంగ్రెస్‌కు రేవంత్‌యే దిక్కా?.. చెక్ ఎలా పెట్టాలో?

ప్రజల కోసం పని చేయాలంటే ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ, తోటి మంత్రిని తొలగించేందుకు రేవంత్ రెడ్డి నానాయాతన పడుతున్నారు. గతంలో కేసీఆర్ బలమైన బీసీ లీడర్ అయిన ఈటల రాజేందర్‌ను చిటికలో తీసివేశారు. కబ్జాకోరు అంటూ ముద్ర వేశారు. హరీశ్ రావుని కొన్నాళ్లు దగ్గరకు రానివ్వలేదు. ప్రభుత్వంలో ఉంటే సీఎంకి వీటి పరిణామాలు తర్వాత గుణపాఠంలా కనిపిస్తాయి.

ప్రజా పాలన అంటూ ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, కొండా విషయంలో సామాజిక సమీకరణల పేరుతో నాలుగు రోజులుగా నాన్చుతున్నారు. భట్టి విక్రమార్క పైరవీ కూడా చేశారు. కానీ, ఏ కాంగ్రెస్ నేతల నీతులు, సిద్దాంతాలు పనికి రాలేదు. గాంధేయవాది మీనాక్షి కూడా చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేవంత్‌యే దిక్కు కానీ, ఎలా బ్యాలెన్స్ చేయాలో అనే ఆలోచనలో అందరూ పడ్డారు. అందుకు మొత్తం శాఖల వారీగా ప్రక్షళన చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ సమావేశాల తర్వాత మార్పు ఇదే?

లీడర్స్ చాలా రకాలుగా ఉంటారు. చదువు సంధ్య లేకున్నా ప్రజల మన్నలను పొంది ఓటు బ్యాంకు పొందే లీడర్స్ ఉంటారు. మేధావుల రూపంలో ఉన్నా ఓట్లు పడని లీడర్స్‌ మరికొందరు. ఎవరెలా ఉన్నా మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే కెపాసిటీ కూడా ఉండాలి. అందుకే ఈసారి కీలకంగా పోస్టులు మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

స్పీకర్ మంత్రి.. మంత్రి స్పీకర్

తెలంగాణలో సామాజికంగా మంత్రి వర్గంలో న్యాయం చేయాలంటే ఎప్పటి నుంచో ఉమ్మడి రంగారెడ్డికి మంత్రి కావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాని కొంత మంది రంగారెడ్డి కోసం ఇద్దరు రెడ్డిలు ప్రయత్నాలు పనికొచ్చేవి కాదు. ఉమ్మడి జిల్లాలుగా చూసుకుంటే ప్రసాద్ రావుకు మంత్రి పదవి ఇస్తే రంగారెడ్డి జిల్లాను సంతృప్తి పర్చినట్లే?

కొండా వివాదంతో అత్యధిక వర్గాలు అంటూనే ఆలోచన?

కొండా ఫ్యామిలీ ద్వారా రెండు కులాలు కలిసి వస్తాయని పదవి ఇస్తే.. ఏ ఒక్కసారి కూడా రుజువు చేసుకోలేదు. పైగా చిల్లర వేషాలుగా ఆడియోలు, కుటుంబ వివాదాలు ఉన్నాయని వదిలించుకునేందుకు సిద్ధం అయ్యారు. ముదిరాజ్ వర్గంలో వాకిటిపై కుట్రలు వచ్చినా కుదిరిపోయారు. యాదవులకు ఇవ్వాలంటే బీర్ల అయిలయ్యనే ఉన్నారు. బీసీ లీడర్‌గా సురేఖ స్థానంలో రెండు కలిసి వచ్చేలా ఉండే నేతలను చూస్తున్నారు. మున్నూరు కాపుల్లో ఆది వేచి చూస్తున్నారు. పద్మశాలీలు ఉన్నా అంత వర్త్‌గా కనిపించడం లేదు. నల్గొండ ఈక్వేషన్‌లో యాదవ్ అయిన బీర్లకు ఇస్తే కష్టంగా మారే అవకాశం ఉంటుంది.

పోతే పొన్నం.. వస్తే మహేష్?

నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరు మంత్రి లేరు. ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మొదటి నుంచి అదిష్టానం మనిషిగా రెండు పడవల్లో ప్రయాణం చేస్తున్నారు. రేవంత్‌తో పాటు మీనాక్షికి ప్రత్యేక నివేదికలు ఇస్తున్నారు. దీంతో సీఎం ఆలోచన తెలంగాణలో అనిగిమనిగి ఉండే పొన్నం బెస్ట్ అంటూ నివేదికలు ఉన్నాయి. దీంతో మహేష్‌కి అవకాశం ఎందుకు ఇవ్వాలో ఒక్కటి కూడా సరైనా సమాధానం లేకుండా చేశారు. సో పొన్నం సేఫ్?

పెద్ద కోమిటి, చిన్న కోమటి ఎవరికో ఒక్కరికే?

నల్గొండ నేతల్లో సగం ఆంధ్రా, సగం తెలంగాణ తెలివి ఉంటుంది. అంతా మేమే అంటారు. అందులో రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ. జానారెడ్డి ఫ్యామిలీ, ఉత్తమ్ ఫ్యామిలీ, కొమటిరెడ్డి ఫ్యామిలీ. ఇందులో వెంకట్ రెడ్డిని మారిస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి ఇవ్వలేమని సీఎం స్పష్టం చేశారు. ఆయన నోటి దూలతో పాటు మరిన్ని వ్యవహారాలు పెరిగిపోవడంతో విసిగెత్తిపోయారని సమాచారం. రాజగోపాల్ రెడ్డి మంత్రి కావడమే గొప్ప. కానీ, సీఎం కావాలని కలలు కన్నా, మరో 20 ఏడ్లు వెయిట్ చేయాలని హైకమాండ్‌కు నివేదిక వెళ్లింది.

శాఖలు మారుతాయి?

ఉత్తమ్‌కు నీటిపారుదల నుంచి రెవెన్యూ, పొంగులేటి రెవెన్యూ వదిలితే మున్సిపాల్ శాఖ ఇవ్వాలని పట్టు, శ్రీధర్ బాబుకి ఆర్ధిక శాఖ, భట్టికి పరిశ్రమలు లేదా నీటిపారుదల, ఉత్తమ్ మరో శాఖ మారితే పద్మావతికి డిప్యూటీ స్వీకర్, మంత్రి సీతక్క మహిళగా, గిరిజన ప్లేస్‌లో సేఫ్‌గా ఉన్నారని టాక్.

అందరి చరిత్ర చెప్పిన సీఎం?

ఢిల్లీ అదిష్టానానికి పైరవీలు చేసిన మంత్రులపై సీఎం అనేక ఆధారాలు చూపించారు. పార్టీ ముఖ్యంగా ఉండాలంటే ఇలా చేయాలి. ప్రభుత్వం బాగుండాలంటే ఇలా ఉండాలి. మంత్రి పదువులు, బుజ్టగింపులు మీ ఇష్టం కానీ, కొండా తీరు ఇదే అంటూ చెప్పడంతో అధిష్టానం డైలమాలో పడి మొత్తం రేవంత్ నిర్ణయమే ఫైనల్ అన్నట్లు సమాచారం. రాజీనామా చేయాలని కోరడంతో అసెంబ్లీ సెక్షన్ కంటే ముందే చేయాల్సి ఉంటుంది. తొలగించేంత వరకు వెళ్తే అసెంబ్లీ సమావేశాలు అయిపోయేంత వరకు సీరియల్ ఎపిసోడ్స్‌లా వేచి చూడాలి..

#Telangana#Congress#politics#rising state#revanth reddy#konda surekha#ponnam#delhi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి