Prabhas: ఈ వారం (సెప్టెంబర్ 3) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రోమాంచికం. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు. దర్శకుడు సందీప్ రెడ్డి సమర్పణలో ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ మూవీగా ఇది తెరకెక్కింది. ఈ నేపథ్యంలో సినిమాకి మన పాన్ ఇండియన్ ప్రభాస్ తన శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి, సంబందించిన టెమ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్‌లో యంగ్ టాలెంట్‌ను మన స్టార్ హీరోలు ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా యువ నటీ నటులను, దర్శక-నిర్మాతలను ఎంజరేజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలకి పెద్ద హీరోలు గనక ఈవెంట్స్ కి వచ్చి సినిమా గురించి మాట్లాడితే ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి మొదలై విజయం వైపు అడుగులు పడతాయి. అందుకే, మన స్టార్స్ సినిమాలకి గెస్టులుగా వస్తూ ఉన్నారు.
ఈ లిస్ట్ లో ప్రభాస్ కూడా ఎప్పుడూ ముందుంటారు. ఆయన ఫుల్ సపోర్ట్ ని ఇస్తున్నారు. ఒకవేళ ప్రభాస్ హైదరాబాద్‌లో లేకపోయినా కూడా.. వెళ్ళగలిగితే ముంబైలో ఉన్నా వెళితే ఆయన టీజర్ లేదా ట్రైలర్ లాంచ్ చేసి టీమ్ ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు, కూడా సందీప్ రెడ్డి మీద అభిమానంతో ఆయన నిర్మించిన రోమాంచికం సినిమాను ప్రమోట్ చేశాడు. చిత్ర బృందానికి సమయం ఇచ్చి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు ప్రభాస్. ప్రస్తుతం, దీనికి సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్-సందీప్ రెడ్డి కాంబోలో 'స్పిరిట్':
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో ఇటు సౌత్‌లో అటు బాలీవుడ్‌లో దర్శకుడిగా అసాధారణమైన క్రేజ్ తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో ఓ కాప్ స్టోరీని రూపొందిస్తున్నాడు. ఇప్పటి వరకూ 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ నెల నుంచి నాన్ స్టాప్ గా మళ్ళీ స్పిరిట్ సెట్స్‌పైకి రానుంది. ఇందులో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ నటిస్తోంది. భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.








