సినిమా

Ramana Gogula: ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయితే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

రమణ గోగుల సంగీతం అందించిన సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన "తమ్ముడు", "బద్రి", "అన్నవరం", "జానీ" సినిమాలకి సంగీతం అందించాడు. 'బంగాళా ఖాతంలో'.. సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. మ్యూజికల్‌గా పవన్-రమణ మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ సారాంశంలో మళ్ళీ కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. 'ఓజీ'లో 'లెట్స్ గో జానీ' సాంగ్ రీమిక్స్ పాడించారు.

Ramana Gogula: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ ది ఒక స్టైల్ అయితే, రమణ గోగులది ఒక ప్రత్యేకమైన స్టైల్. మెలోడీలోనే వెస్ట్రన్ మిక్స్ చేసి సాంగ్స్ కంపోజ్ చేసిన విధానం ఒకప్పుడు పెద్ద సంచలనంగా మారింది. మ్యూజికల్‌గా ఆయన ఆల్బంస్ అన్నీ ఎంతో హిట్ అయ్యాయి. కొత్త సినిమా పోస్టర్స్ మీద "సంగీతం: రమణ గోగుల" అని కనిపిస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్సైయ్యారు. అలాంటి, క్రేజీ కాంబినేషన్ "పవన్ కళ్యాణ్-రమణ గోగులది". మళ్ళీ వీరి కాంబోలో సినిమా ఉండే ఛాన్స్ లేకపోలేదని లేటెస్ట్ పోస్ట్ తో క్లారిటీ వచ్చింది.

వాయిస్‌తో మ్యాజిక్ చేసిన రమణ గోగుల:

విక్టరీ వెంకటేష్, ప్రీతీ జింటా జంటగా నటించిన "ప్రేమంటే ఇదేరా".. సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. సయంత్.సి.పరాన్‌జి దర్శకుడు. ఈ సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్ సాధించింది. ఆయన వాయిస్ కి ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. అప్పట్లో, ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ వెస్ట్రన్ కల్చర్‌లో ఉండేవి. సునీత ఎక్కువ సాంగ్స్ పాడటం విశేషం.

పవన్ కళ్యాణ్‌కి బ్లాక్ బస్టర్ ఆల్బంస్:

రమణ గోగుల సంగీతం అందించిన సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన "తమ్ముడు", "బద్రి", "అన్నవరం", "జానీ" సినిమాలకి సంగీతం అందించాడు. 'బంగాళా ఖాతంలో'.. సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. మ్యూజికల్‌గా పవన్-రమణ మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ సారాంశంలో మళ్ళీ కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. 'ఓజీ'లో 'లెట్స్ గో జానీ' సాంగ్ రీమిక్స్ పాడించారు.

వెంకీతో కూడా సూపర్ హిట్స్:

వెంకటేష్‌తో "ప్రేమంటే ఇదేరా", "లక్ష్మీ" లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అలాగే, గత ఏడాది వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో 'గోదారి గట్టుమీద రామ చిలుకవే'.. సాంగ్ పాడి మళ్ళీ సింగర్‌గా హాట్ టాపిక్ అయ్యాడు. సచిన్ తో "మౌనమేలనోయి", మహేష్ బాబుతో "యువరాజు", ప్రభాస్ కి "యోగి" లాంటి సినిమాలకి అందించిన మ్యూజిక్ ఛార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఎవరికి మ్యూజిక్ చేసినా పవన్ తో మాత్రం రమణ గోగులకి స్పెషల్ జర్నీ ఉంది.

#Pawan Kalyan#Ramana Gogula#Badri#Thammudu#Jhony#Annavaram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి