సినిమా

Shiva Nirvana: రామ్ చరణ్ కోసం సీక్వెల్ రాయలేను..పాత్రలో సరిపోతేనే!

రచన: Anshu4 నిమిషాల పఠనం

Shiva Nirvana: "ఇరుముడి" సినిమాతో సాలీడ్ కంబ్యాక్ ఇచ్చాడు దర్శకుడు శివ నిర్వాణ. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరిన నేపథ్యంలో మేకర్స్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు శివ నిర్వాణ పలు ఆసక్తికరమైన విషయాలను..సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా "ఇరుముడి" సీక్వెల్‌లో రామ్ చరణ్ నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన "ఇరుముడి" అందరికీ మంచి సక్సెస్‌ను ఇచ్చింది. ముఖ్యంగా, ఫ్లాపుల్లో ఉన్న హీరో రవితేజ, దర్శకుడు శివ నిర్వాణలకి ఈ సినిమా సక్సెస్ అనేది చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. కథగా చెప్పుకుంటే చాలా చిన్న పాయింట్. ఒక ఊరిలో తాగుడికి బానిసైన వ్యక్తి తన కూతురు కోసం 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష తీసుకుంటే ..ఆ సమయంలో ఎలాంటి పరిస్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది..అన్న పాయింట్ మీదే తీశారు.

కానీ, ఇందులో సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి. చాలారోజుల తర్వాత ఒక ఎమోషనల్ సినిమాను చూసిన ఆడియన్స్, కంటతడి పెట్టకుండా థియేటర్స్ నుంచి బయటకు రావడం లేదు. ఇక, ఈ సినిమాలో ఉన్న అయ్యప్ప సాంగ్ మేజర్ ప్లస్ అయింది. 'మల్లెపూల పల్లకి' సాంగ్ రిలీజ్ అయ్యాక ఇందులో చరణ్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చినట్టుగా మాట్లాడుకున్నారు. అలాగే, సినిమా రిలీజ్ కి ముందు ప్రచారం జరిగింది.

అయితే, తాజాగా జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడిని ఈ విషయం అడిగారు. "ఇరుముడి" సీక్వెల్ ఉంటుందా?..ఉంటే అది చరణ్‌తో చేస్తారా? అని..దీనికి చాలా డీసెంట్ ఆన్సర్ ఇచ్చాడు శివ నిర్వాణ. చరణ్ తో సీక్వెల్ అంటే చాలా బావుంటుంది. కాని..కథ అంత ఆర్గానిక్‌గా కుదరాలి. బలవంతంగా చరణ్‌తో సినిమా చేయలేను. అలాంటి సహజమైన కథ రాస్తే, అందులో ఆయన పాత్ర బలంగా ఉంటుందనిపిస్తే తప్పకుండా చేస్తానని..ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో, సీక్వెల్ గురించి..అందులో రామ్ చేరణ్ నటిస్తాడనే వార్తలకి చెక్ పెట్టినట్టైంది.

#Irumudi#Irumudi 2#Shiva Nirvana#Raviteja#Ram Charan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి