సినిమా

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి హిట్ పడి 8 ఏళ్ళవుతోంది..రణబాలి గట్టెక్కిస్తేనే..!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి హిట్ పడి 8 ఏళ్ళవుతోంది..రణబాలి గట్టెక్కిస్తేనే..! అవును మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, గీత గోవిందం లాంటి సినిమాలతో క్లాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా పాపులర్ అయ్యాడు. కానీ, మళ్ళీ ఆ స్థాయి హిట్ ఇన్నేళ్ళలో ఇప్పటి వరకూ హిట్ దక్కలేదు.

2018లో వరుస హిట్స్:

2018 వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ గా నిలిచాయి. వాస్తవానికి టాక్సీవాలా ముందు రిలీజ్ కావాల్సింది. కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్‌తో కొన్నాళ్ళు విడుదల కాలేదు. అదే సమయంలో గీత గోవిందం వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. దాంతో, టాక్సీవాలా సినిమాకి లైన్ క్లియర్ అయింది. అలా, రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. అంతే, మళ్ళీ విజయ్ కి హిట్ అన్నది లేదు.

‘డియర్ కామ్రేడ్’ నుంచి విజయ్ కి ఫ్లాప్స్ మొదలయ్యాయి. వరల్డ్ ఫేమస్ లవర్, నోటా, ‘లైగర్’, ‘కింగ్‌డమ్’, ఫ్యామిలీ స్టార్..ఇలా అన్నీ ఫ్లాప్స్ వచ్చాయి. అయినా, కూడా విజయ్ కి మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎప్పుడు, సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం అదే క్రేజ్ కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్ కి ఖచ్చితంగా ఒక సాలీడ్ హిట్ కావాల్సిందే.

టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయమైన రాహుల్ సాంకృత్యన్ మళ్ళీ విజయ్ దేవరకొండతో చేస్తోన్న పాన్ ఇండియా సినిమా రణబాలి. ఇప్పటి, వరకు విజయ్ కెరీర్‌లో ఇలాంటి సినిమాను చేయలేదు. పీరియాడిక్ సినిమాగా రూపొందుతోన్న రణబాలి ఈ హీరో కెరీర్‌కి చాలా కీలకం అని చెప్పాలి. అక్టోబర్ 16న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికైతే, ఈ మూవీ నుంచి ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనలను రేకెత్తించింది. మరి, దాదాపు 8 ఏళ్ళ నుంచి ఎదురుచూస్తున్న హిట్ రణబాలి సినిమాతో దక్కుతుందా లేదా చూడాలి.

#Vijay Devarakonda#Ranabaali#Rashmika Mandanna#Rahul Sankrityan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి