National

Delhi Police: జంతర్‌‌మంతర్‌లో మహిళా జర్నలిస్టులపై ఏసీపీ లైంగిక వేధింపులు!

రచన: Mahesh•••5 నిమిషాల పఠనం

Delhi Police: దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్ సాక్షిగా ఢిల్లీ పోలీసులు అత్యంత హేయమైన చర్యకు ఒడిగట్టారని సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు మహిళా జర్నలిస్టులపై ఓ ఉన్నతస్థాయి పోలీస్ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించారని చెబుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు

Delhi Police: దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్ సాక్షిగా ఢిల్లీ పోలీసులు అత్యంత హేయమైన చర్యకు ఒడిగట్టారని సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు మహిళా జర్నలిస్టులపై ఓ ఉన్నతస్థాయి పోలీస్ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించారని చెబుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు చేపట్టిన నిరసనల లైవ్ కవరేజ్ టైంలో ఈ అరాచకం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. యూనిఫాంలో ఉన్న ఏసీపీ స్థాయి అధికారే అంత బహిరంగంగా మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సోషల్ మీడియా, మీడియా వర్గాలు కోడై కూయడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

నిలదీసినందుకు ఒంటిపై చేతులేసి తోసేశారు!

జంతర్‌మంతర్ పరిసరాల్లో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా పోలీస్ వ్యాన్లలోకి ఎక్కిస్తున్న తీరును జర్నలిస్టులు కెమెరాల్లో బంధిస్తున్నారు. అయితే నిరసనల్లో పాల్గొన్న మహిళలను అదుపులోకి తీసుకునే టైంలో ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేకపోవడాన్ని అక్కడే విధుల్లో ఉన్న మహిళా జర్నలిస్టులు క్వశ్చన్ చేశారు. అలా ప్రశ్నించడంతో కక్షగట్టిన ఏసీపీ వివేక్ భగత్ విచక్షణ కోల్పోయి.. రూల్స్ గుర్తుచేసిన మహిళా రిపోర్టర్లపై దౌర్జన్యానికి దిగి, వారిని అసభ్యంగా తాకుతూ వెనక్కి నెట్టేశారని బాధితులు ఆరోపించారు. ఈ దారుణంపై వెంటనే పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

విచారణ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగింత..

బాధిత జర్నలిస్టుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, మహిళా సంఘాలు భగ్గుమనడంతో ఢిల్లీ పోలీస్ విభాగం దిద్దుబాటు చర్యలు స్టార్ట్ చేసింది. నిష్పాక్షిక దర్యాప్తు జరిపిస్తామంటూ ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం రిలీజ్ చేశారు. మరోవైపు, సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ పదవి నుంచి తప్పుకోకుంటే ఈనెల 10న ఢిల్లీ వేదికగా దేశవ్యాప్త ఆందోళనలకు దిగుతామని కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరించింది.

హోంమంత్రి సమాధానం చెప్పాలి: రాహుల్ గాంధీ

ఈ ఘటనపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశ రాజధానిలో విధుల్లో ఉన్న మహిళా రిపోర్టర్లపైనే పోలీసుల లైంగిక వేధింపులు కొనసాగడంపై తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఢిల్లీ పోలీసులు చేసిన ఈ అరాచకానికి హోంమంత్రి అమిత్ షా పూర్తి బాధ్యత వహించాలని, తక్షణమే ఆ అధికారిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

#Delhi Police#Delhi News#Jantar Mantar#Women Journalists#Female Journalists#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి