Krithi Shetty: ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, వాటిలో బంగార్రాజు తప్ప మిగతావన్నీ యావరేజ్ సినిమాలుగా నిలిచాయి. ఇక, దాంతో, కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కేవలం, గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. తనలోని నటనను పూర్తిస్థాయిలో బయటకు తీసుకొచ్చే విభిన్నమైన పాత్రల కోసం ఎదురుచూస్తోంది.
ముఖ్యంగా, ఒక యోధురాలి పాత్రలో నటించాలని కృతి శెట్టి చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. గ్లామర్ అండ్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా.. ధైర్యం, పోరాటం, భావోద్వేగాలు కలగలిసిన పాత్ర తనకు దొరికితే పూర్తిగా ఛాలెంజ్‌గా తీసుకుని నటించేందుకు సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని చెప్పింది కృతీ. ఈ మధ్య తెలుగులో చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ, ఇప్పుడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12 విడుదల సినిమాలో కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తోంది.
తమిళంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వా వాతియార్ లాంటి సినిమాలు చేసింది. అక్కడ, ఆశించిన విధంగా అవకాశాలు రావడం లేదు. కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి ఓ ఐటం సాంగ్ లో కూడా కృతీ నర్తించి నడుము అందాలతో ఆకట్టుకుంది. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ..వరుస ఫ్లాప్స్ వల్ల ఆ క్రేజ్ కంటిన్యూ చేయలేకపోయింది. కృతీ శెట్టి ఆశలన్నీ అనిల్ రావిపూడి సినిమా మీదే పెట్టుకుంది.
హీరోయిన్‌కి కమర్షియల్ సినిమాలకంటే ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ తో వచ్చే పాపులారిటీ నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. అందుకే, కృతి కూడా ఓ యువ రాణి పాత్రలోనో...యోధురాలి పాత్రలోనో నటించాలని అతిపెద్ద కల..ఆ కల నెరవేర్చే దర్శకుడి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది కృతి. అలాంటి, కథతో ఎవరైనా వస్తారా అని హింట్ కూడా ఇచ్చింది. మరి, ఈ ఉప్పెన బ్యూటీ కల తీర్చే దర్శకుడెవరో చూడాలి.


