తెలంగాణ

Telangana Politics: కంచుకోటలో వణుకు.. బీఆర్‌ఎస్ మాజీలకు కేసీఆర్ బిగ్ షాక్!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Telangana Politics: తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ శిబిరంలో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఎదురులేని ఆధిపత్యం చలాయించిన మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేల గుండెల్లో ఇప్పుడు టికెట్ భయం పట్టుకుంది.

Telangana Politics: తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ శిబిరంలో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఎదురులేని ఆధిపత్యం చలాయించిన మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేల గుండెల్లో ఇప్పుడు టికెట్ భయం పట్టుకుంది.

గత శాసనసభ ఎన్నికల్లో మార్పులు చేయకుండా సిట్టింగ్‌లందరికీ మూకుమ్మడిగా టికెట్లు ఇవ్వడమే పార్టీ ఓటమికీ ప్రధాన కారణమనే క్లారిటీకి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్, ఈసారి పాత తప్పులను రిపీట్ చేయకూడదని గట్టి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల కోసం జిల్లావ్యాప్తంగా సాగుతున్న అంతర్గత రహస్య సర్వేలు, అధిష్ఠానం చేపట్టిన సీక్రెట్ ప్రక్షాళన మాజీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

కామారెడ్డికి గుడ్‌బై.. కేసీఆర్ రూట్ క్లియర్!

గత ఎన్నికల్లో కామారెడ్డి బరిలో నిలిచి ఊహించని ఓటమిని చవిచూసిన గులాబీ దళపతి కేసీఆర్, ఈసారి అక్కడి నుంచి మళ్లీ పోటీ చేసేందుకు ఎంతమాత్రం ఆసక్తి చూపడం లేదని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో కామారెడ్డి బరిలో సరికొత్త స్థానిక నాయకత్వాన్ని దించేందుకు హైకమాండ్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అధిష్ఠానం నుంచి సూచనప్రాయంగా అనుమతి పొందిన ఇద్దరు ముగ్గురు కొత్త నేతలు నియోజకవర్గ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తుండటం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

బాన్సువాడ, ఆర్మూర్‌లలో అనూహ్య మార్పులు

సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఖాళీ అయిన బాన్సువాడపై నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆశలు పెట్టుకున్నారు. అయితే, అధిష్ఠానం మాత్రం ఇక్కడ పాత ముఖాల కంటే బలమైన స్థానిక బీసీ వర్గానికి చెందిన కొత్త నేతకు బాధ్యతలు అప్పగించి క్షేత్రస్థాయి క్యాడర్‌ను కాపాడుకోవాలనే వ్యూహంతో ఉంది.

ఆర్మూర్ సెగ్మెంట్‌లో సిట్టింగ్ నేతలకు చెక్ పెడుతూ, పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి లేదా ఆయన కుమారుడిని రంగంలోకి దించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. మరోవైపు చార్టర్డ్ అకౌంటెంట్ రాజశేఖర్ సైతం టికెట్ రేసులో ఉంటూ అధిష్ఠానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అసెంబ్లీకి చెక్.. పార్లమెంట్‌కు షిఫ్ట్

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న మాజీ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ నిరాకరించడమే కాకుండా, వారిని పక్క నియోజకవర్గాలకు మార్చడమో లేదా పార్లమెంట్ (ఎంపీ) ఎన్నికల బరిలోకి నెట్టడమో చేయాలని కేసీఆర్ పక్కా వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. "గెలిచేవారికే టికెట్.. వ్యతిరేకత ఉంటే పక్కకు తప్పించడమే" అనే కేసీఆర్ కఠిన వైఖరితో, నిన్నటివరకు తమదే తిరుగులేని అధికారం అనుకున్న సీనియర్ నేతలకు తమ రాజకీయ భవిష్యత్తుపై అపనమ్మకం స్టార్ట్ అయ్యిందని అంటున్నారు . కంచుకోటలోనే పట్టు కోల్పోతామా అన్న భయం ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ గులాబీ నేతలను వెంటాడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#BRS#Bharat Rashtra Samithi#Telangana Politics#Telangana Political News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి