తెలంగాణ

TG: బాధేస్తోంది.. తెలంగాణలో కరవు విలయంపై కవిత తీవ్ర ఆవేదన!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: తెలంగాణ గడ్డపై పచ్చని పైర్లు నెర్రెలు బారుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు కష్టపడి వేసిన పంటలు నీళ్లందక కళ్లెదుటే మాడిపోతుంటే కాంగ్రెస్ పెద్దలు మాత్రం పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. క్షేత్రస్థాయిలో నెలకొన్న తీవ్ర కరవు, తాగునీటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.

పూజలతో నెపం దాటవేస్తారా?

పల్లెల్లో రైతులు నీటిబొట్టు కోసం అల్లాడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి వరుణయాగం చేసి చేతులు దులుపుకున్నారని కవిత మండిపడ్డారు. యాగాల పేరిట కాలయాపన చేయడమే తప్ప, ఎండిన పైర్లను కాపాడేందుకు సర్కారు వద్ద ఎలాంటి స్పష్టమైన కార్యాచరణ లేదని ఎద్దేవా చేశారు. కరవు కోరల్లో చిక్కుకున్న మండలాలను అధికారికంగా గుర్తించి ప్రకటిస్తే కేంద్ర నిధులైనా రైతులకు అందుతాయని, ఆ పని చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసొప్పడం లేదని నిలదీశారు.

మన నీళ్లు పక్క రాష్ట్రానికి.. మన నేలలు బీడుగా!

ఒకవైపు మన అన్నదాతలు సాగునీరు లేక గుండెలవిసేలా రోదిస్తుంటే, కృష్ణా నీళ్లను ఆంధ్రాలోని కుప్పం దాకా తరలిస్తుండటం చూసి గుండె తరుక్కుపోతోందని కవిత ఆందోళన చెందారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కోసమే పాలమూరు గొంతు ఎండబెట్టి నీళ్లను గిఫ్ట్‌గా ఇస్తున్నారని ఆరోపించారు. పల్లెల్లో చేతికొచ్చిన పంటలు ఎండిపోవడమే కాకుండా, హైదరాబాద్ లాంటి నగరాల్లోనూ గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరకని దారుణ పరిస్థితులు వచ్చాయని వాపోయారు.

కరెంట్ కోతలపై రేవంత్ ఊరికే వస్తా!

పొలాలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నామంటూ పాలకులు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, గ్రామాల్లో రైతులకు ఆరేడు గంటలకు మించి కరెంట్ అందడం లేదని కవిత స్పష్టం చేశారు. విద్యుత్ కోతలు లేవని బుకాయిస్తే.. ఆ నిజాన్ని నిరూపించేందుకు సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లికి సైతం వచ్చేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. మొండివైఖరి వీడి వెంటనే కరవు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, పవర్ కట్స్ లేకుండా చూసి కర్షక లోకాన్ని ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

#Telangana#TG News#Telangana Politics#Kavitha#Telangana Rakshana Sena#swechaaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి