సినిమా

Rajashekhar: బాలయ్యకి విలన్‌గా స్టార్ హీరో!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Rajashekhar: సీనియర్ హీరోలు ఈ మధ్య కాలంలో విలన్ పాత్రల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి, కారణాలు ప్రధానంగా మూడు అని చెప్పుకోవచ్చు. ఒకటి, కొందరు హీరోలకి మార్కెట్ తగ్గడం..దాంతో, హీరోగా అవకాశాలు కరువవడం. రెండు..ఏజ్ ఫ్యాక్టర్‌తో హీరో వేషాలు రాకపోవడం. మూడవది..బాలీవుడ్ తరహాలో హీరోలకి విలన్ ఛాన్సులు వస్తే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగడానికి మంచి అవకాశం ఉండటం.

Rajashekhar: సీనియర్ హీరోలు ఈ మధ్య కాలంలో విలన్ పాత్రల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి, కారణాలు ప్రధానంగా మూడు అని చెప్పుకోవచ్చు. ఒకటి, కొందరు హీరోలకి మార్కెట్ తగ్గడం..దాంతో, హీరోగా అవకాశాలు కరువవడం. రెండు..ఏజ్ ఫ్యాక్టర్‌తో హీరో వేషాలు రాకపోవడం. మూడవది..బాలీవుడ్ తరహాలో హీరోలకి విలన్ ఛాన్సులు వస్తే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగడానికి మంచి అవకాశం ఉండటం. అందుకే, జగపతి బాబు, శ్రీకాంత్, ఆది పినిశెట్టి లాంటి వారు విలన్‌గా టర్న్ తీసుకున్నారు. ఆ లిస్ట్ లో డా.రాజశేఖర్ కూడా చేరారు.

కొరటాల శివ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ అప్ డేట్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో తాజా వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇటీవల, యంగ్ హీరో శర్వానంద్ నటించిన బైకర్ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించాడు.

రీసెంట్ మూవీ ది ప్యారడైజ్ సినిమాలో కూడా సీనియర్ హీరో మంచు మోహన్ బాబు విలన్ పాత్రలో భయపెట్టాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా, మోహన్ బాబు పాత్ర బాగానే హైలెట్ అయింది. ఇలాంటి, పాత్ర తన కెరీర్‌లో మొదటిసారి చేసినట్టుగా మోహన్ బాబు ఇంటర్వ్యూలల్లో చెప్పాడు. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత బలంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టే, మన సీనియర్ హీరోలు దర్శకులు తయారు చేసుకున్న విలన్ పాత్రలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే రాజశేఖర్ కూడా గత కొంతకాలంగా నెగిటివ్ రోల్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మంచి క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా, హీరోను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్ర వస్తే చేయడానికి రెడీ అన్నట్టుగా ఇప్పటికే చాలా సందర్భాలలో హింట్ ఇచ్చాడు. అలా, కొరటాల శివ సినిమాలో రాజశేఖర్ పాత్ర డిజైన్ చేసినట్టుగా సమాచారం.

ఇక, ఈ రోల్ చాలా కొత్తగా ఉంటుందని.. భయంకరమైన విలన్ పాత్రలో ఆయన నటించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ కూడా ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. తండ్రి- కొడుకు పాత్రలలో మరోసారి బాలయ్య కనిపించనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. కాగా. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మొదలు పెట్టనున్నారట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా ఇదే కావడంతో.. కథపై ఎక్కువ సమయం కేటాయించి పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేశాడు కొరటాల. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న దాదా పూర్తి కాగానే కొరటాల సినిమా సెట్స్‌పైకి వస్తుంది.

#Balakrishna#Koratala Shiva#NBK 112#Rajashekhar#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి