National

India - Russia Relations: ప్రపంచమంతా పాక్ వైపు ఉన్నప్పుడు మాకు తోడుగా నిలిచింది ఒక్క రష్యానే: జైశంకర్

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

India - Russia Relations: రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు వేస్తున్న పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మా దేశానికి కష్టం వచ్చినప్పుడు ఎవరు అండగా నిలబడ్డారు,

India - Russia Relations: రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు వేస్తున్న పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మా దేశానికి కష్టం వచ్చినప్పుడు ఎవరు అండగా నిలబడ్డారు, ఎవరు ప్రత్యర్థి పక్షాన నిలిచారనే వాస్తవాన్ని భారతీయులు ఎప్పటికీ మరిచిపోరని కుండబద్దలు కొట్టారు. ఢిల్లీ వేదికగా జరిగిన 62వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాస్కోతో న్యూఢిల్లీ బంధం వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన కుండబద్దలు కొట్టినట్లు వివరించారు.

నాడు పాక్‌కు అగ్రరాజ్యాల అండ.. భారత్‌కు రష్యా భరోసా

1950లో అంతర్జాతీయంగా మెజారిటీ దేశాలు పాకిస్థాన్‌కు కొమ్ముకాసిన సందర్భంలో కేవలం సోవియట్ రష్యా మాత్రమే భారత్‌కు సపోర్ట్‌గా నిలిచిందని జైశంకర్ గుర్తుచేశారు. అంతేకాకుండా 1971లో పాక్‌తో జరిగిన భీకర యుద్ధ సమయంలోనూ భారత్‌‌కు వెన్నుదన్నుగా నిలిచింది మాస్కో మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ క్లిష్ట సమయంలో అగ్రరాజ్యం అమెరికా సైతం పాకిస్థాన్‌కే మద్దతు పలికిన చేదు నిజాన్ని ఎవరూ చెరిపివేయలేరని తేల్చిచెప్పారు. చరిత్ర అనేది మంచిదైనా, చేదైనా ప్రజల జ్ఞాపకాల్లో పదిలంగా ఉంటుందని, దశాబ్దాలుగా రష్యా అందిస్తున్న సపోర్ట్‌ని భారత్ విస్మరించబోదని ఆయన తేల్చిచెప్పారు.

మారిన సమీకరణాలు.. సొంత లాభాలే ముఖ్యం

ప్రస్తుత ప్రపంచ పరిణామాల గురించి ప్రస్తావిస్తూ.. అమెరికా తన సొంత దేశ ప్రయోజనాల కోసమే విదేశాంగ విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటోందని ఆయన ఎత్తిచూపారు. మరోవైపు చైనా కూడా శరవేగంగా బలపడుతుండటంతో ఆ రెండు దేశాల మధ్య తీవ్ర ఆధిపత్య పోటీ నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నాయని, తమకు నమ్మకమైన వ్యూహాత్మక మిత్రులను ఎంచుకుంటున్నాయని జైశంకర్ చెప్పారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, దేశ హితమే తమకు అత్యున్నత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.

#India Russia Relations#India Russia Ties#S Jaishankar#Jaishankar#Russia#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి