Fauzi-Imanvi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.
‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రకటించి ప్రభాస్ లుక్ రిలీజ్ చేసినప్పుడే దేశభక్తి, సైనిక నేపథ్యం, యాక్షన్ అంశాలు ఉన్నట్టుగా అర్థమైంది. అయితే. ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే కాకుండా.. కథ, భావోద్వేగాలు, పాత్రల పరంగా ప్రభాస్‌ను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ సినిమాలకు పూర్తి భిన్నమైన ట్రీట్‌మెంట్ ఇందులో ఉండబోతుందనే అంచనాలు పోస్టర్స్ తోనే క్రియేట్ అయ్యాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలతో తన పాన్ ఇండియా ఇమేజ్‌ను మరింత బలపరుచుకున్నాడు. దీంతో ప్రభాస్ నుంచి వచ్చే ప్రతి కొత్త సినిమా సహజంగానే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ‘ఫౌజీ’ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.
అయితే, ఈ సినిమా మొదలై రెండేళ్ళు దాటిపోతోంది. ఎప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమా అంటే ఇలాంటి డిలే కామన్ అయిపోయింది. దానివల్ల, ఇతర నటీనటులకి మిగతా సినిమాలను ఒప్పుకోలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా, హీరోయిన్స్ ఒక్క ప్రభాస్ సినిమా మీదే హోప్స్ పెట్టుకుంటే చాలా కష్టంగా మారింది పరిస్థితి. డెబ్యూ హీరోయిన్ అంటే ఇంకా కష్టం. ఎందుకంటే, మొదటి సినిమా ప్రభాస్‌తో ఫిక్సవడం వల్ల..ఈ సినిమా రిలీజై హిట్ సాధిస్తే ఆ తర్వాత వచ్చే క్రేజ్‌తో కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవచ్చుననే ఆలోచన ఉంటుంది. అదీకాక, అగ్రిమెంట్ విషయంలోనూ కొన్ని షరతులు ఉంటాయి. ఈ సినిమా విడుదలయ్యాక గానీ కొత్త సినిమాకి సైన్ చేయకూడదని. అలాంటి, షరతులు ఇమాన్వీ కి మేకర్స్ పెట్టారా అన్నది తెలియాల్సి ఉంది. పాపం, ఇదే గనక నిజమైతే ప్రభాస్ సినిమా వల్ల రెండేళ్లకి పైగానే ఇమాన్వీ లాకైనట్టు.


